సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా జ్ఞానవేల్ టీజే డైరెక్షన్ లో వస్తున్న సినిమా వేటయ్యన్. ఈ సినిమాలో రానా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ లాక్ చేశారు. అక్టోబర్ 10న దసరా స్పెషల్ గా వేటయ్యన్ ని రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఐతే ఈ సినిమాకు పోటీగా సూర్య కంగువని రిలీజ్ చేయాలని అనుకున్నారు.
శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సూర్య (Surya) కంగువ సినిమా భారీ బడ్జెట్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుంది. అక్టోబర్ 10న సూర్య కంగువ, రజిని వేటయ్యన్ రెండు ఢీ కొడతాయని అనుకున్నారు. కానీ సూర్య కంగువ సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. సూపర్ స్టార్ రజిని (Rajinikanth) మీద ఉన్న అభిమానంతోనే దసరా కి తమ సినిమాను రిలీజ్ చేయట్లేదని సూర్య వెల్లడించారు.
చిన్నప్పటి నుంచి రజిని అభిమానిని.. 50 ఏళ్ల సుధీర్ఘ అనుభవం ఉన్న ఆయన సినిమాకు సోలో రిలీజ్ అందించాలనే ఉద్దేశంతో తమ సినిమా వాయిదా వేస్తున్నామని అన్నారు సూర్య. కార్తీ హీరోగా నటించిన కొత్త సినిమా ఈవెంట్ కి వెళ్లి కంగువ పోస్ట్ పోన్ పై క్లారిటీ ఇచ్చారు సూర్య.
ఐతే సూపర్ స్టార్ మీద పోటీలా కాకుండా సూర్య కంగువ (Kanguva) ఆయనకు రెస్పెక్ట్ ఇస్తూ సినిమాను వాయిదా వేయడం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. సూర్య కంగువ అక్టోబర్ 10 నుంచి వాయిదా పడ్తుందని చెప్పిన సూర్య కొత్త రిలీజ్ డేట్ త్వరలో ప్రకటిస్తామని అన్నారు. కంగువ సినిమాను శివ దర్శకత్వం వహిస్తుండగా సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సంగీతం పరంగా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని టాక్.
Also Read : Gabbar Singh Rerelease : హరీష్ శంకర్ మల్లెపూలు.. బండ్ల గణేష్ ఏం చెప్పారంటే..!