కంగువ తర్వాత సూర్య చేస్తున్న సినిమా తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraj) డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమా విషయంలో సూర్య చాలా జాగ్రత్త పడుతున్నాడని తెలుస్తుంది. సూర్య 44 వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కార్తీక్ రెండు క్రేజీ టైటిల్స్ ని ఫైనల్ చేశారని తెలుస్తుంది. లవ్ స్టోరీ విత్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ వస్తుంది.
పూజా హెగ్దే ప్రేమ కోసం సూర్య (Surya,) చేసే సాహసాలు అదిరిపోతాయని తెలుస్తుంది. జిగర్ తండా డబల్ ఎక్స్ తర్వాత కార్తీక్ సుబ్బరాజు చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు జానీ, కల్ట్ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారట. జానీ సినిమా టైటిల్ ఆల్రెడీ వచ్చిందే కాబట్టి కల్ట్ ఐతే పర్ఫెక్ట్ అని ఫ్యాన్స్ అంటున్నారు. సూర్య అండ్ టీం ఏది ఫైనల్ చేస్తుంది అన్నది చూడాలి.
సూర్య 44 సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ క్రిస్మస్ కానుకగ రాబోతుంది. ఈ టీజర్ లోనే సినిమా టైటిల్ ప్రకటిస్తారని తెలుస్తుంది. సూర్య జానీ అయినా, కల్ట్ తో వచ్చినా ఈసారి టార్గెట్ మాత్రం మిస్ అయ్యేది లేదని అంటున్నారు. కంగువ తీవ్ర నిరాశ పరచడంతో సూర్య 44 తో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాను నెక్స్ట్ మార్చిలో రిలీజ్ షెడ్యూల్ చేస్తున్నట్టు తెలుస్తుంది.