Oscars 2022: ఆస్కార్ బరిలో ‘‘జైభీమ్, మరక్కర్’’ సినిమాలు!

గురువారం ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’’ 94వ ఆస్కార్స్ పరిశీలనకు అర్హత పొందిన 276 చిత్రాల జాబితాను వెల్లడించింది. అందులో సూర్య ప్రధాన పాత్రలో నటించిన జైభీమ్ సినిమా కూడా ఉంది.

  • Written By:
  • Updated On - January 21, 2022 / 01:40 PM IST

గురువారం ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’’ 94వ ఆస్కార్స్ పరిశీలనకు అర్హత పొందిన 276 చిత్రాల జాబితాను వెల్లడించింది. అందులో సూర్య ప్రధాన పాత్రలో నటించిన జైభీమ్ సినిమా కూడా ఉంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా ఆస్కార్ 2022 అవార్డ్స్ కు నామినేట్ అయ్యింది. గతేడాది ఓటీటీల వేదికగా రిలీజ్ అయిన ఈ సినిమా సర్వత్రా ప్రశంసలు దక్కించుకుంది. IMDB రేటింగ్ లోనూ శభాష్ అనిపించుకుంది. ఇప్పుడు 94వ ఆస్కార్ అవార్డుల రేసులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పురస్కారం కోసం మరో 275 చిత్రాలతో పోటీ పడబోతోంది. జనవరి 18న ఆస్కార్స్ యూట్యూబ్ ఛానెల్‌లో జైభీమ్ సినిమా కూడా ప్రదర్శించబడింది. ఈ సినిమా తమిళనాడులో 1990ల నాటి నిజ జీవిత సంఘటన నుంచి ప్రేరణ పొందింది. ఒక అమాయక గిరిజన వ్యక్తిపై దొంగతనం ఆరోపణ చేయబడి, కస్టడీలో చిత్రహింసలకు గురై, చివరికి తన ప్రాణాలను కోల్పోయాడు. నిజ జీవితంలో చనిపోయిన వ్యక్తి భార్య కోసం పోరాడిన జస్టిస్ K. చంద్రుని ఆధారంగా సూర్య ఈ చిత్రంలో న్యాయవాది చంద్రుడి పాత్రను సూర్య పోశించాడు.

ఆస్కార్స్ యూట్యూబ్ ఛానెల్ జైభీమ్ వీడియో చూసి ‘‘ ఈ సినిమా అద్భుతంగా ఉంది. తమిళనాడులోని ఆదివాసీ తెగలకు న్యాయం చేసిన యాక్టివిస్ట్ లాయర్ చంద్రు ఎందరికో ఆదర్శం. రచయిత-దర్శకుడు TJ జ్ఞానవేల్ కథ కథనం బాగుంది’’ అని రియాక్ట్ అయ్యింది. ‘జై భీమ్’ చిత్రాన్ని సూర్య, అతని భార్య జ్యోతిక 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. నిర్మాణ సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వార్తను షేర్ చేసింది. ఇది అత్యున్నత గౌరవం అంటూ ట్వీట్ చేసింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తాజా పీరియాడికల్ డ్రామా మరక్కర్ అధికారికంగా ఆస్కార్ 2021 జాబితాలో ఉంది.