Site icon HashtagU Telugu

Suriya : మానవత్వంలోనూ రియల్ హీరో.. ‘జైభీమ్’ బాధితురాలికి 10 లక్షల సాయం!

జస్టీస్ చంద్రు జీవిత చరిత్ర ఆధారంగా తమిళ్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘జైభీమ్’ సినిమా అన్ని వర్గాలవారిని ఆకట్టుకుంటోంది. పలు భాషల్లో విడుదలైన సినిమాకు అంతటా పాజిటివ్ రెస్పాన్ వస్తోంది. సూర్య నటన, సినతల్లి ఎమోషన్స్, కోర్టు, పోలీసుల నేపథ్యంలో సాగిన ఘటనలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరూ ‘వకీల్ సాబ్’ అంటే ఇలా ఉండాలంటూ సూర్య నటనకు ఫిదా అవుతున్నారు.

అయితే ‘జైభీమ్’ సినిమా జస్టీస్ చంద్రు జీవిత కథ ఆధారంగా తీయడమే కాకుండా పలువురి గిరిజనుల జీవిత గాథలనూ తెరకెక్కించారు. ఈ సినిమాలో సినతల్లి పాత్ర ఓ గిరిజన మహిళా ఆధారంగా తీసినదే. 1990లలో రాజకన్ను కస్టడీ మరణాన్ని ఈ సినిమాలో చూపించారు. జై భీమ్ చిత్రానికి సహ నిర్మాతగా మరియు నటించిన నటుడు సూర్య, బాధితుడి రాజకన్ను భార్య పార్వతి పేరు మీద ₹10 లక్షలు డిపాజిట్ చేయాలని నిర్ణయించుకున్నారు. చెన్నై సమీపంలో దినసరి కూలీగా జీవనోపాధి పొందుతున్న పార్వతికి ఆర్థిక సహాయం చేయాలని శనివారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కె. బాలకృష్ణన్ శ్రీ సూర్యను అభ్యర్థించారు. తాను ₹10 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేస్తానని, ఆమె వడ్డీని ఉపయోగించుకోవచ్చని, ఆమె తర్వాత, ఆమె వారసులు ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు,” అని సూర్య చెప్పాడు.

Exit mobile version