Oscars 2025: విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించడం హీరో సూర్యకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఆయన నటించే ప్రతీ సినిమా స్పెషల్‌గా ఉంటుంది. తాజాగా ఆయన నటించిన కంగువ మూవీ ఏకంగా 2025 సంవత్సర ఆస్కార్ అవార్డుల రేసులోకి ఎంటర్ అయింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల కోసం ప్రపంచవ్యాప్తంగా 207 సినిమాలు నామినేట్ కాగా, వాటిలో మన దేశానికి చెందిన కంగువ(Oscars 2025) సినిమా కూడా ఉండటం విశేషం. బెస్ట్ మూవీ కేటగిరీలో కంగువ నామినేట్ అయినట్లు తెలిసింది. దీనితో పాటు మన దేశం నుంచి ‘ఆడు జీవితం : ది గోట్ లైఫ్’ సినిమా, ‘గర్ల్స్ విల్ బి గర్ల్స్’ సినిమా ఆస్కార్ ఎలిజిబుల్ నామినేషన్స్ జాబితాలో చోటును దక్కించుకున్నాయి. ఆస్కార్ అవార్డుల కోసం ఈ మూడు సినిమాల నిర్మాతలు వ్యక్తిగతంగా అప్లై చేసుకున్నారు. భారత ఆస్కార్ కమిటీతో ఈ నామినేషన్‌కు సంబంధం లేదు. ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన 207 సినిమాలకు జనవరి 8వ తేదీ నుంచి జనవరి 12 వరకు ఓటింగ్ జరుగుతుంది. అవార్డులకు ఎంపికైన సినిమాల తుది జాబితాను జనవరి 17న రిలీజ్ చేస్తారు.
Also Read :Earthquake Alerts : మీ ఫోన్‌కు భూకంపాల అలర్ట్స్ రావాలా ? ఈ సెట్టింగ్స్ చేసుకోండి
కంగువ సినిమా కథ
- కంగువ సినిమా 2024 సంవత్సరం నవంబర్‌లో రిలీజ్ అయింది. అయితే నిర్మాతలకు భారీ నష్టాలు మిగిలాయి.
- రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కంగువ మూవీ రూ.100 కోట్ల లోపే కలెక్షన్స్ చేసింది.
- కథలో కొత్తదనం లేకపోవడంతో కంగువ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
- ఈ మూవీలో కార్తి గెస్ట్‌రోల్‌లో కనిపించాడు.
- ఫ్రాన్సిన్ పాత్రలో సూర్య, కోల్ట్ పాత్రలో యోగిబాబు నటించారు. వీరిద్దరూ గోవాలో బౌంటీ హంటర్స్‌గా పనిచేస్తుంటారు.క్రిమినల్స్‌ను పట్టుకోవడంలో పోలీసులకు సాయం చేస్తుంటారు.
- క్రిమినల్స్‌ను పట్టించినప్పుడల్లా వీళ్లకు పోలీసులు డబ్బులు ఇస్తుంటారు.
- ఈక్రమంలో మరో బౌంటీ హంటర్ ఏంజెలీనాను (దిశా పటానీ)ని ఫ్రాన్సిస్ లవ్ చేస్తాడు.
- అయితే ఏంజెలీనా, ఫ్రాన్సిస్ లవ్ బ్రేక్ అవుతుంది.
- ఓ రష్యన్ ల్యాబ్ నుంచి జెటా అనే చిన్నారి తప్పించుకొని ఫ్రాన్సిస్ దగ్గరికి వస్తాడు. ల్యాబ్ మనుషుల నుంచి జెటాను ఫ్రాన్సిస్ కాపాడుతాడు.
- ఈ క్రమంలో జెటాతో ఫ్రాన్సిస్‌కు పూర్వజన్మ సంబంధం ఉందనే విషయం తెలుస్తుంది.
- 1070 సంవత్సర కాలంలో విదేశీయుల బారి నుంచి ప్రణవాది తెగను కాపాడిన కంగువ ఎవరు? కంగువతో జెటాకు ఎలాంటి రిలేషన్ ఉంది? అనేది ఈ సినిమాలో చూపిస్తారు.