Suriya: కంగువ తర్వాత ఆ డైరెక్టర్ తో పనిచేయబోతున్న సూర్య.. దర్శకుడు ఎవరో తెలుసా?

తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ చిత్రం కంగువ. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - March 28, 2024 / 08:57 PM IST

తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ చిత్రం కంగువ. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా హీరో సూర్య ఒక పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇటీవల సూర్య ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా కొత్త కొత్త కథలతో వస్తున్నాడు. ప్రస్తుతం సూర్య శివ దర్శకత్వంలో కంగువ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే కంగువ గ్లింప్స్ రిలీజ్ అయ్యి సినిమాపై భారీ అంచనాలు పెంచింది.

ఈ సినిమా కోసం తమిళనాడులోనే కాక పాన్ ఇండియా ఎదురుచూస్తున్నారు. కంగువ లాంటి భారీ బడ్జెట్, పీరియాడిక్ సినిమా తర్వాత రాబోయే సినిమాని తాజాగా ప్రకటించాడు సూర్య. సూర్య నెక్స్ట్ సినిమాని తమిళ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేయనున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ మీద, ఒక చెట్టుకి హార్ట్ సింబల్ వేసి అది బ్రేక్ చేసినట్టు ఉంది. లవ్ తో పాటు కామెడీ, యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని సమాచారం.

ఇది సూర్య 44వ సినిమాగా రానుంది. ప్రస్తుతం సూర్య కంగువ చివరి దశ షూటింగ్ లో ఉన్నాడు. ఈ సినిమా అయ్యాక సూర్య కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సినిమా షూట్ మొదలు పెట్టనున్నాడు సూర్య. సూర్య ప్రస్తుతం సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. సూర్య నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతున్నాయి.