Suriya – Jyothika : సూర్య జ్యోతిక లవ్ స్టోరీ ఎలా ఎప్పుడు మొదలైంది..? ఫస్ట్ ప్రపోజల్ ఎవరిది..?

కోలీవుడ్ లో స్టార్ కపుల్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే జంట సూర్య-జ్యోతిక(Suriya Jyothika).

Published By: HashtagU Telugu Desk
Suriya

Suriya Jyothika Love Story and Marriage Interesting News

కోలీవుడ్ లో స్టార్ కపుల్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే జంట సూర్య-జ్యోతిక(Suriya Jyothika). వీరిద్దరూ కలిసి దాదాపు ఏడు సినిమాల్లో నటించారు. ఆన్ స్క్రీన్ పై ఈ జంట ఆడియన్స్ ని ఎంతగా ఆకట్టుకుంటుందో.. ఆఫ్ స్క్రీన్ లో అంతకుమించి ప్రేక్షకుల మనసు దోచుకుంటుంటుంది. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ లవ్ స్టోరీ ఎప్పుడు, ఎలా మొదలైందో తెలుసా..? అలాగే ఫస్ట్ ఎవరు లవ్ ప్రపోజల్ పెట్టారో తెలుసా..? ఈ విషయాలని జ్యోతిక ఒక సందర్భంలో అభిమానులకు తెలియజేసింది.

వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడం, పెళ్లి సంబంధాలు ఫిక్స్ చేసుకోవడం అనేవి కేవలం నెల రోజుల్లోనే జరిగిపోయాయట. 1999లో తెరకెక్కిన ‘పూవెల్లమ్ కెట్టుప్పర్’ అనే సినిమాలో మొదటిసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఈ మూవీ చేస్తున్న సమయంలోనే సూర్య, జ్యోతిక మధ్య ప్రేమ చిగురించిందట. సూర్య ఆడవారికి చాలా గౌరవం ఇస్తాడట. సినిమాలో రొమాంటిక్ సీన్స్ చేసే సమయంలో దానిని అదునుగా తీసుకోకుండా.. దర్శకుడు సూచిన మేరకు తన పరిమితిలో మాత్రమే నటిస్తాడట. అలా మహిళల పట్ల సూర్య ఇచ్చే గౌరవమే తనని ఆకర్షించినట్లు జ్యోతిక చెప్పుకొచ్చింది. ఆ సినిమా తర్వాత వీళ్ళ ప్రేమ కొన్నాళ్లపాటు సాగింది.

ఇక వీరిద్దరిలో ముందుగా సూర్యనే లవ్ ప్రపోజ్ చేశాడట. దానికి జ్యోతిక కూడా ఒకే అనడం, ఆ వెంటనే సూర్య గురించి తన ఇంటిలో వారికీ చెప్పడం, వాళ్ళ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిపోయాయి. ఇక వీరి వివాహం 2006 లో జరిగింది. ఒక ఇంటర్వ్యూలో జ్యోతిక సూర్య గురించి మాట్లాడుతూ.. “సూర్య తండ్రిగా, భర్తగా తన బాధ్యతల పట్ల ఎంతో సిన్సియర్‌గా ఉంటాడు. నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాడు. ప్రతి ఆనందక్షణాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకుంటాడు. సూర్యని చూసి నేర్చుకోమని చాలామంది మహిళలు తమ భర్తలకు చెప్పడం నేను ప్రత్యక్షంగా చూశాను. అలాంటి భర్త నా లైఫ్ లోకి రావడం నా అదృష్టం” అంటూ చెప్పుకొచ్చింది.

 

 

  Last Updated: 28 Oct 2023, 08:25 PM IST