Site icon HashtagU Telugu

Suriya : ఫ్యాన్స్‌కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సూర్య.. రక్తదానం చేసి..

Suriya, Blood Donation, Kanguva

Suriya, Blood Donation, Kanguva

Suriya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్నారు. కాగా ఈ హీరో పుట్టినరోజు ఈ నెల 23న జరగబోతుంది. గత ఏడాది ఈ పుట్టినరోజుని సూర్య అభిమానులు చాలా గ్రాండ్ గా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడి హీరోల బర్త్ డేలకు సమానంగా బైక్ ర్యాలీలు చేసి సూర్య పై తమ అభిమానాన్ని చాటుకున్నారు తెలుగు ఫ్యాన్స్.

కాగా తమిళనాడులో ఎన్నో సంవత్సరాలు నుంచి సూర్య పుట్టినరోజు నాడు అభిమానులు రక్తదానం చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే గత ఏడాది కూడా రక్తదానం చేసారు. లాస్ట్ ఇయర్ దాదాపు రెండు వేలకు పైగా అభిమానులు రక్తదానం చేసి సూర్యని సంతోషంతో పాటు ఆశ్చర్యపరిచారు. ఇక ఆ అభిమానాన్ని చూసిన సూర్య గత ఏడాది పుట్టినరోజు నాడు ఫ్యాన్స్ కి ఒక మాట ఇచ్చారు. వచ్చే ఏడాది తాను కూడా రక్తదాన కార్యక్రమంలో పాల్గొని బ్లడ్ డొనేషన్ చేస్తానని చెప్పారు.

ఇక ఆ మాట నిలబెట్టుకునేందుకు సూర్య నేడు బ్లడ్ డొనేషన్ క్యాంపుకి వచ్చి రక్తదానం చేసారు. ఏదో ఒక చిన్న మాట అని వదిలేకుండా, దానిని గుర్తుపెట్టుకొని ఈ సంవత్సరం రక్తదానం చేయడం పట్ల అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సూర్య కూడా రక్తదానం చేయడంతో ఫ్యాన్స్ లో మరింత సేవ భావం కనిపిస్తుంది. కాగా నిన్న ఒక్కరోజులోనే దాదాపు 400కు పైగా అభిమానులు బ్లడ్ డొనేషన్ చేశారట. మరి ఈ ఏడాది ఎంతమంది రక్తదానం చేస్తారో చూడాలి.

కాగా సూర్య ప్రస్తుతం కంగువా సినిమాలో నటిస్తున్నారు. శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ గా రాబోతుంది. అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.