Site icon HashtagU Telugu

Suriya About Tollywood Hero’s: టాలీవుడ్ స్టార్ హీరోల గురించి సూర్య చెప్పిన ఆసక్తికరమైన విషయాలు!

Suriya About Tollywood Hero's

Suriya About Tollywood Hero's

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువ’ చిత్రం నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌కు శివ దర్శకత్వం వహించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ వంటి మూడున్నర భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రమోషన్లు ఉత్సాహంగా జరుగుతున్నాయి, ముఖ్యంగా తెలుగు వెర్షన్‌పై సూర్య ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆదివారం భారీగా నిర్వహించబడింది.

కంగువ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అనేక మంది ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో సూర్య టాలీవుడ్ స్టార్ హీరోల గురించి మాట్లాడి, ఒక్కొక్కరిపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ప్రభాస్ గురుంచి:

“తెలుగులో పెద్ద హీరోలు ఉన్నారని, కొందరి పేర్లు చెప్పుతాను, వారిలో ఏమి నచ్చిందో తెలియజేయండి” అని డైరెక్టర్ శివ సూర్యను అడిగారు. దానికి స్పందిస్తూ, సూర్య ‘ప్రభాస్.. డార్లింగ్, స్వీట్ హార్ట్’ అని వ్యాఖ్యానించారు. మిర్చి చిత్రంలోని ‘కొన్నికొన్ని నమ్మేయాలి, డ్యూడ్’ డైలాగ్‌ను గుర్తుచేశారు. ఏదైనా చేయగలరని ప్రజలను ప్రభాస్ నమ్మించగలరని సూర్య అన్నారు. కల్కి అద్భుతంగా ఉందని, కల్కి 2 కోసం వేచిచూస్తున్నానని అన్నారు.

పవన్ కల్యాణ్ గురించి:

శివ, పవన్ కల్యాణ్ గురించి మాట్లాడాలని సూర్యను అడిగారు. సూర్య మాట్లాడుతూ, ‘సినిమాల్లోను, నిజజీవితంలోను పవన్ ఒకే లాగా ఉంటారు. ఆయన ఓపెన్ హార్టెడ్ వ్యక్తి.’ పవన్ కల్యాణ్ చేసిన ప్రసిద్ధ గెస్చర్‌ను కూడా సూర్య గుర్తుచేశారు.”

మహేష్ బాబు గురించి:

సూర్య, మహేశ్ బాబు గురించి మాట్లాడుతూ, ‘మనం స్కూల్‌కి కలిసి వెళ్లిన రోజులు గుర్తు ఉంటాయి. స్కూల్‌లో మహేశ్ నాకు జూనియర్’ అని తెలిపారు. ‘ఏ సినిమా చేసినా, మహేశ్ డిఫరెంట్ లీగ్‌లో ఉంటాడు. ఆయన ఎక్స్‌ప్రెషన్లు అద్భుతంగా ఉంటాయి’ అని అన్నారు. మహేశ్ బాబు యాక్టింగ్ యాటిట్యూడ్ తనకు చాలా నచ్చుతుందన్నారు.

అల్లు అర్జున్ గురించి:

సూర్య, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ, ‘అల్లు అర్జున్ పడే కష్టానికి నేను పెద్ద ఫ్యాన్. ఆయన డ్యాన్స్‌ను నేను ఎంతో ఆసక్తిగా చూస్తాను’ అని చెప్పారు. ‘పుష్ప 2 కోసం వేచిచూస్తున్నాను’ అని సూర్య తెలిపారు. తెలుగులో గజినీ చిత్రాన్ని అల్లు అరవింద్ విడుదల చేసినందుకు నేను ఈ స్థాయిలో ఉన్నానన్నారు.

రామ్ చరణ్ గురించి:

సూర్య, రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ, ‘రామ్ చరణ్ 15 సినిమాలలోనే గ్లోబల్ స్టార్ అయ్యారు. ఆయన నాకు సోదరుడి లాంటి వారు’ అని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ గురించి:

సూర్య, జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ, ‘ఎవరూ ఎన్టీఆర్‌లా స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడలేరు’ అన్నారు. ‘తారక్ ఎనర్జీతో నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇతర ఇండస్ట్రీలో ఉన్న వారు కూడా ఎన్టీఆర్‌కు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచిస్తుంటారు’ అని చెప్పారు.

చిరంజీవి గురించి:

సూర్య, జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు గెలిచినప్పుడు చిరంజీవి తనకు కాల్ చేసి అభినందించినట్లు వెల్లడించారు. ‘నాకు ఎక్స్‌లో చాలామంది విష్ చేశారు, కానీ చిరంజీవి స్వయంగా కాల్ చేసి అభినందనలు తెలిపారు. ఆయనతో కలిసి ఆయన ఇంట్లో భోజనం చేసిన విషయం గుర్తు చేసుకున్నారు. ఆయన మా కోసం వడ్డించారు’ అని చెప్పారు. అలాగే, తనకు చెన్నైలో ఓ ఎన్జీవో ఉందని, ఇది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్ఫూర్తితోనే ప్రారంభించానని సూర్య వివరించారు.