Surendar Reddy : పవన్ కళ్యాణ్ సినిమా పక్కన పెట్టేసి ఇంకో సినిమాకు రెడీ అవుతున్న డైరెక్టర్..

గతంలో SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ రామ్ తాళ్లూరి నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమాను అనౌన్స్ చేసారు.

Published By: HashtagU Telugu Desk
Surendar Reddy Leaves Pawan Kalyan Movie and starts another Project

Surendar Reddy

Surendar Reddy : పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయ్యాక సినిమాలకు డేట్స్ ఇవ్వడం కష్టపమయిపోతుంది. పవన్ చేతిలో ఎన్నికల ముందు నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో OG, హరిహర వీరమల్లు సినిమాలు మాత్రం సగం షూట్ అవ్వడంతో కుదిరినప్పుడు షూటింగ్ కు డేట్స్ ఇస్తూ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా బిజీగా ఉండటంతో షూట్స్ కి డేట్స్ ఇవ్వలేని పరిస్థితి. దీంతో OG, హరిహర వీరమల్లు సినిమాలు లేట్ అయినా ఎలాగోలా షూట్ చేస్తున్నారు.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే మొత్తానికే పక్కన పెట్టేయడంతో హరీష్ శంకర్ వేరే సినిమాలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకో సినిమా కూడా మొత్తానికే పక్కన పెట్టిసినట్టు తెలుస్తుంది. గతంలో SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ రామ్ తాళ్లూరి నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమాను అనౌన్స్ చేసారు. ఆ సినిమాకు సంబంధించి అనౌన్స్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఆ పోస్టర్ తో ఇదేదో యాక్షన్ సినిమాలా ఉండబోతుంది అనుకున్నారు.

కానీ పవన్ రాజకీయాల బిజీతో ఆ సినిమా కూడా పక్కన పడింది. ఇన్ని రోజులు ఎప్పుడో అప్పుడు వస్తాడు ఈ సినిమా షూట్ కూడా చేస్తాడు అని మూవీ టీమ్ ఎదురుచూసారు. కానీ ఇప్పుడు అసలు డేట్స్ ఇచ్చే పరిస్థితిలో లేకపోవడంతో ఈ సినిమాని పూర్తిగా పక్కన పెట్టేసినట్టు తెలుస్తుంది. తాజాగా నిర్మాత రామ్ తాళ్లూరి ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న కథ కిక్, రేసుగుర్రం లాంటి కథ. అది ఎప్పుడో మొదలవ్వాలి. కానీ సురేందర్ రెడ్డి ఏజెంట్ వల్ల, ఆ తర్వాత కరోనా వల్ల వాయిదా పడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చే పరిస్థితిలో లేరు. అందుకే సురేందర్ రెడ్డి మరో కథను సిద్ధం చేసుకుంటున్నాడు. ఆ సినిమా కూడా మేమే నిర్మిస్తున్నాం. ఆ కథను కూడా ఓ పెద్ద హీరోకి వినిపించబోతున్నాం అని తెలిపారు. దీంతో సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమా పక్కన పెట్టి ఇంకో సినిమా మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

 

Also Read : Game Changer : గేమ్ ఛేంజర్ టీజర్ ప్రోమోనే ఈ రేంజ్ లో ఉందంటే.. ఇక టీజర్, ట్రైలర్, సినిమా ఏ లెవెల్లో ఉంటాయో..

  Last Updated: 09 Nov 2024, 09:19 AM IST