Site icon HashtagU Telugu

Surekha Vani: నాకు సినిమా అవకాశాలు రావడం లేదు: సురేఖా వాణి ఎమోషనల్!

Surekha Vani

Surekha Vani

దసరా పండగ రోజున విడుదలైన స్వాతి ముత్యం సినిమాకి సినీ విమర్శకుల నుంచి పాజిటివ్ కామెంట్స్ రావడంతో టీమ్ సంబరాలు చేసుకుంటోంది. ఇటీవలే టీమ్ సక్సెస్ మీట్ జరుపుకుంది. ఈ కార్యక్రమంలో నటి సురేఖా వాణి మాట్లాడుతూ తనకు సినిమాలో అవకాశం కల్పించిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు. సురేఖా వాణి సినిమాలకు గుడ్ బై చెప్పిందని, అందుకే తాను సినిమాల్లో నటించడం లేదని పుకార్లు షికార్లు చేస్తున్నాయని చెప్పింది. అవన్నీ రూమర్స్ అని అన్నారు. తాను సినిమాలతోనే ఉంటానని స్పష్టం చేశారు.

ఇక తాను సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని, సినిమా ఆఫర్లతో తనను ఎవరూ సంప్రదించడం లేదని ఎమోషనల్ అయ్యింది. స్వాతి ముత్యం సినిమాలో బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలు పోషించారు. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహించగా సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.