టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి (Surekha Vaani).. తన వ్యక్తిగత జీవితంతో పాటు తన కూతురు సుప్రీత (Supritha) కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. సోషల్ మీడియాలో ఇద్దరూ యాక్టివ్‌గా ఉండటంతో, వారి ఫోటోలు, వీడియోలు ఎప్పుడూ చర్చనీయాంశం అవుతుంటాయి. తల్లి కూతుళ్లు కలిసి చేసే హంగామా అభిమానులను ఆకట్టుకుంటుండగా, సుప్రీత తన గ్లామర్ డోస్‌తో ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకుంది.
Atal Bihari Vajpayee Death Anniversary : వాజ్‌పేయీ వర్ధంతి .. ప్రధాని, రాష్ట్రపతి ఘన నివాళి
ప్రస్తుతం సుప్రీత తన కెరీర్‌ను స్థిరపరచుకునేందుకు ప్రయత్నిస్తోంది. బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్‌తో కలిసి ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉండగా.. సుప్రీత సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండి అభిమానులతో టచ్‌లో ఉంటుంది. సినిమాకు సంబంధించిన అప్డేట్స్‌తో పాటు తన వ్యక్తిగత క్షణాలను కూడా షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.
అంతేకాకుండా.. సుప్రీత షేర్ చేస్తున్న గ్లామరస్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఫోటోషూట్లలో పోజులు ఇస్తూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. తన అందంతో అభిమానులను అలరిస్తూ, తనను తాను ప్రమోట్ చేసుకోవడంలో వెనుకడుగు వేయడం లేదు. దీంతో సుప్రీత ఫోటోలు, అప్‌డేట్స్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.