Site icon HashtagU Telugu

Adivi Sesh-Supriya: అక్కినేని ఇంట పెళ్లిభాజాలు.. అడవి శేష్ తో సుప్రియ పెళ్లి?

Supriya And Shesh

Supriya And Shesh

టాలీవుడ్ లో మరో జంట పెళ్లి చేసుకోబోతోంది. ఇప్పటికే మెగా హీరో వరుణ్ తేజ్, అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాటి డేటింగ్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అనేక రూమర్స్ హల్ చల్ చేశాయి. తాజాగా టాలీవుడ్ లో మరో గాసిప్ వినిపిస్తోంది. ‘అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నాగార్జున మేనకోడలు సుప్రియ. ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పిన సుప్రియ కొంతకాలంగా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తోంది.

అయితే సుప్రియ టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ తో డేటింగ్ చేస్తున్నారని అనేక వార్తలు వినిపించాయి. రూమర్స్ అన్నీ నిజమయ్యేలా  శేష్ కూడా అక్కినేని ఫ్యామిలీ ఫంక్షన్లలో కనిపించాడు కూడా. సుప్రియతో చాలా చనువుగా ఉన్నట్టు ఫొటోలు కూడా బయటకొచ్చాయి.  అయితే ఎట్టకేలకు వీరిద్దరి పెళ్లి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. నాగార్జున ఫ్యామిలీ ఒకే చెప్పినట్టు, జూన్ 16న వీరి పెళ్లి జరగనున్నట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని అక్కినేని ఫ్యామిలీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. అయితే 2019 నుంచి జంట డేటింగ్ లో ఉన్నట్ట ప్రచారం జరుగుతుంది. కానీ ఈ విషయమై అటు సుప్రియ కానీ, శేష్ కానీ ఎక్కడా కూడా క్లారిటీ ఇవ్వలేదు.

Also Read: Jr NTR’s Simhadri: రిరిలీజ్ లోనూ ‘సింహాద్రి’ రికార్డులు.. యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు పూనకాలే!

Exit mobile version