Site icon HashtagU Telugu

Tollywood: అమ్మాయి.. అబ్బాయి కలిశారు.. పవన్ ను కలిసిన సుప్రియ

Supriya

Supriya

Tollywood: చాలా అరుదైన సందర్భం ఈ ఇద్దరిదీ.. అప్పట్లో మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కల్యాణ్, అక్కినేని ఫ్యామిలీ నుంచి సుప్రియ ఒకే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి వచ్చారు.. తర్వాత పవన్ కళ్యాణ్ ఎన్నో సినిమాల్లో నటించి పవర్ స్టార్ గా ఎదిగి సొంతంగా పార్టీ పెట్టి అఖండ విజయంతో డిప్యూటీ సీఎం అయ్యారు.. ఒకే సినిమాలో నటించి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైన సుప్రియ రీసెంట్ గా గూఢచారి సినిమాలో గెస్ట్ రోల్ చేసారు.. తాజాగా ఒకప్పుడు తనతో నటించిన హీరో కమ్ డిప్యూటీ సీఎం దగ్గరకి సినిమా ఇండస్ట్రీ తరఫున ప్రొడ్యూసర్ గా వచ్చి కలిశారు సుప్రియ.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ తో టాలీవుడ్ నిర్మాతలు భేటీ అయ్యారు. ఏపీలో సినీరంగం విస్తరణకు సంబంధించిన అంశాలపై వారు చర్చిస్తున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న సినీనిర్మాతలు అక్కడి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత అక్కడకు చేరుకున్న సిననీ నిర్మాతలు ఆయనతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.