Site icon HashtagU Telugu

Padamati Kondallo:  ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్

Padamati Kondallo

Padamati Kondallo

Padamati Kondallo: సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్‌ ‘ఎక్స్‌’ వేదికగా ‘పడమటి కొండల్లో’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. శ్రీదేవి క్రియేషన్స్ బ్యానర్ పై విన్విత ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ ద్వారా జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా ఈ ‘పడమటి కొండల్లో’ చిత్ర నిర్మాణం జరిగింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన నరేష్ పెంట, సంగీతాన్ని కూడా అందించారు.

అనురోప్ కటారి హీరో గా నటిస్తున్న ఈ ‘పడమటి కొండల్లో’ పోస్టర్ లో తన లుక్, గెట‌ప్‌ చాలా గంభీరంగా ఉన్నాయి, హీరో రౌద్ర రస హావభావాలతో రక్తం అంటిన కత్తి పట్టుకుని నడుస్తున్న పోస్ అది, పెద్ద విద్వంసం జరిగిన ప్రదేశంలో, సినిమాలో ఫైట్ సీన్ లో లుక్ లా ఉంది. ద‌ర్శ‌కుడు చిత్ర విశేషాల‌ను తెలియ‌జేస్తూ “పడమటి కొండల్లో” సినిమాతో సరి కొత్త ఎక్స్పీరియన్స్ ని ప్రేక్షకులు పొందుతారని, ఈ చిత్రానికి ఒక మార్క్ ఉంటుంది అని, యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా కొన‌సాగే ఈ చిత్రంలో వుండే ప్రేమ‌క‌థ ఎంతో ఆస‌క్తిక‌రంగా వుంటుంద‌ని, సినిమా మొత్తం ఒక డిఫ‌రెంట్ అండ్ విజువ‌ల్ ఫీస్ట్‌లా వుండేలా ప్ర‌దేశంలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుతామ‌ని, భవిష్యత్తులో మరిన్ని అప్డేట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తామని తెలిపారు.