The Kerala Story : కేరళ స్టోరీ చిత్రయూనిట్ కి షాక్ ఇచ్చిన సుప్రీమ్ కోర్ట్..

ఈ నేపథ్యంలో ఈ కథ అబద్దం అంటూ, కల్పితం అని కొంతమంది సుప్రీం కోర్టులో కేసు వేయగా, తాజాగా సుప్రీం కోర్టు విచారించి చిత్రయూనిట్ కి ఆదేశాలు జారీ చేసింది.

  • Written By:
  • Publish Date - May 21, 2023 / 09:00 PM IST

ఇటీవల సంచలనం సృష్టించి వివాదాలకు దారి తీసిన సినిమా ది కేరళ స్టోరీ(The Kerala Story). అదా శర్మ(Adah Sharma), సిద్ది ఇదాని.. మరికొంతమంది ముఖ్య పాత్రల్లో సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ది కేరళ స్టోరీ. కేరళలో(Kerala) కొంతమంది అమ్మాయిలను మతం మార్చి ISIS, ఉగ్రవాదానికి తరలిస్తున్నారనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. మొదటి నుంచి కూడా ఈ సినిమాపై విమర్శలు వచ్చాయి. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా చిన్న సినిమాగా రిలీజయి అనంతరం దేశవ్యాప్తంగా రిలీజయి భారీ విజయం సాధించింది.

ఇప్పటికే ది కేరళ స్టోరీ సినిమాకు దాదాపు 175 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాని పలువురు విమర్శిస్తుంటే, కొంతమంది మాత్రం సపోర్ట్ చేస్తూ, ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా అని అంటున్నారు. తమిళనాడు, బెంగాల్ లాంటి రాష్ట్రాలు సినిమాను అడ్డుకోవద్దు అనే కోర్టు తీర్పుని కూడా ధిక్కరించి ఈ సినిమాను బ్యాన్ చేశాయి. ఇక ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఈ సినిమాకు ట్యాక్స్ ఫ్రీ ఇచ్చాయి. అయితే ఇప్పటికీ ఈ సినిమాని తప్పుపడుతూ పలువురు విమర్శలు చేస్తూ, కోర్టుల్లో కేసులు వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ కథ అబద్దం అంటూ, కల్పితం అని కొంతమంది సుప్రీం కోర్టులో కేసు వేయగా, తాజాగా సుప్రీం కోర్టు విచారించి చిత్రయూనిట్ కి ఆదేశాలు జారీ చేసింది. ది కేరళ స్టోరి సినిమా ప్రదర్శనకు ముందు ఇది కల్పితం అని, సృజనాత్మకంగా సృష్టించిందని డిస్‌క్లయిమర్‌ వేయవల్సిందిగా చిత్రయూనిట్ ని సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ది కేరళ స్టోరి చిత్ర ప్రదర్శనలో మార్పులు చేస్తామని చిత్రయూనిట్ తెలిపారు. కేరళలో 32 వేల మంది మహిళలను ఇస్లాం మతంలోకి మార్చారని చెప్పడానికి ఎలాంటి ప్రామాణికత లేదని, అందుకే ఈ డిస్‌క్లయిమర్‌ వేయాలని సుప్రీమ్ కోర్టు స్పష్టం చేసింది.

 

Also Read : Music Director Raj : ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత.. విషాదంలో టాలీవుడ్..