Murari Rerelease సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్భంగా ఆగష్టు 9 శుక్రవారం మురారి సినిమా రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ రీ రిలీజ్ సందర్భంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా కాదు. విజయవాడ అలంకార్ థియేటర్ లో అయితే మహేష్ ఫ్యాన్స్ అయిన ఒక ప్రేమ జంట థియేటర్ లోనే పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు. స్టార్ సినిమాల రీ రిలీజ్ కు ఈ రేంజ్ హడావుడు ఇప్పుడు చాలా కామన్ అయ్యింది.
ఐతే మహేష్ బర్త్ డే అవ్వడం సూపర్ హిట్ సినిమా కావడంతో మురారి రీ రిలీజ్ ని సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా భారీగా చూశారు. అందుకే ఇప్పుడు ఆ సినిమా రీ రిలీజ్ కలెక్షన్స్ తో అదిరిపోయే రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. మురారి రీ రిలీజ్ కలెక్షన్స్ తో రీ రిలీజ్ సినిమాల ఆల్ టైం రికార్డ్ (All Time Record) నెలకొల్పాడు సూపర్ స్టార్. తెలుస్తున్న సమాచారం ప్రకారం మురారి సినిమా రీ రిలీజ్ సందర్భంగా డే 1 5.45 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
Also Read : Mega Vs Allu: మెగా vs అల్లు: ఈ వివాదం ఎలా శాంతిస్తుందా?
ఇది తెలుగు సినిమా రీ రిలీజ్ డే 1 న సరికొత్త రికార్డ్ సృష్టించింది. రీ రిలీజ్ టైం లో కూడా ఏరియాల వారిగా సత్తా చాటాడు మహేష్. నైజాం, ఆంధ్రా, రెస్ట్ ఆఫ్ ఇండియా అన్ని చోట్ల అదరగొట్టాడు. మహేష్ బర్త్ డే సందర్భంగా రాజమౌళి సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఫ్యాన్స్ అంతా మురారి రీ రిలీజ్ హంగామా లో పాల్గొన్నారు.
ముఖ్యంగా మహేష్ లేడీ ఫ్యాన్స్ కూడా రీ రిలీజ్ టైం లో డాన్సులు, కేక్ కటింగ్స్ తో అదరగొట్టర్రు. మహేష్ కు ఉన్న ఫ్యాన్ బేస్ ఏంటన్నది ఈ రీ రిలీజ్ సందర్భంలో మరోసారి ప్రూవ్ అయ్యింది. ప్రస్తుతం మహేష్ రాజమౌళి సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు. లుక్ ఫైనల్ అయ్యాక డైరెక్ట్ గా ఫస్ట్ లుక్ తోనే సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని తెలుస్తుంది.