Superstar Mahesh : మురారి ఎడిటెడ్ వెర్షన్.. ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం..!

రీ రిలీజ్ సినిమా విషయంలో డైరెక్టర్స్ అంత యాక్టివ్ గా ఉండరు కానీ మురారి (Murari) విషయంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఆ సినిమా డైరెక్టర్ కృష్ణవంశీ

Published By: HashtagU Telugu Desk
Superstar Mahesh Birthday Murari Edited Version Rerelease

Superstar Mahesh Birthday Murari Edited Version Rerelease

స్టార్ హీరోల బర్త్ డేకి వారి ఫ్యాన్స్ చేసే హంగామా ఎలా ఉంటుందో తెలిసిందే. ఐతే ఈమధ్య ప్రతి స్టార్ హీరో బర్త్ డేకి ఆ హీరో ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. మహేష్ నుంచే మొదలైన ఈ రీ రిలీజ్ హంగామా ఫ్యాన్స్ కి మళ్లీ పాత రోజులు గుర్తు చేస్తున్నాయి. ఇక రాబోతున్న ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) బర్త్ డే సందర్భంగా మహేష్ నటించిన మురారి సినిమా 4కే వెర్షన్ రీ రిలీజ్ చేస్తున్నారు.

ఫ్యాన్స్ అంతా ఆ సినిమా కలెక్షన్స్ తో రికార్డులు కొల్లగొట్టాలని చూస్తున్నారు. ఐతే రీ రిలీజ్ సినిమా విషయంలో డైరెక్టర్స్ అంత యాక్టివ్ గా ఉండరు కానీ మురారి (Murari) విషయంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఆ సినిమా డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamshi) అందుబాటులో ఉన్నారు. అంతేకాదు సినిమా గురిచి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని ఖుషి చేస్తూ ట్వీట్స్ వేస్తున్నారు.

ఇదిలాఉంటే మురారి సినిమా రీ రిలీజ్ సందర్భంగా 18 నిమిషాలు ఎడిటెడ్ వెర్షన్ రిలీజ్ చేస్తున్నారట. అలా ఎందుకు అన్నది రీజన్స్ తెలియదు కానీ మురారి ఎడిటెడ్ వెర్షన్ ఆగష్టు 9న థియేటర్ లోకి రానుంది. మహేష్ కెరీర్ లో ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ మురారి. మహేష్ సరసన సోనాలి బింద్రే (Sonali Bendre) హీరోయిన్ గా నటించింది.

ఇక మహేష్ తన నెక్స్ట్ సినిమాను రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ ఏదైనా బర్త్ డే నాడు వస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు కానీ.. అది జరిగేలా కనిపించట్లేదు. సో మహేష్ ఫ్యాన్స్ మురారి తోనే మహేష్ బర్త్ డే (Mahesh Birthday) ని సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అని తెలుస్తుంది.

Also Read : Tollywood : టాలీవుడ్ లో ఆ ఇద్దరి హీరోయిన్స్ దూకుడు..!

  Last Updated: 18 Jul 2024, 04:22 PM IST