టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నేడు Enforcement Directorate (ED) విచారణకు హాజరవుతారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. సాయిసూర్య డెవలపర్స్ (Saisurya Developers) మరియు సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీ(Surana Group of Companies)ల మానీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసి, హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ కార్యాలయంలో నేడు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో మహేష్ విచారణకు హాజరవుతారా లేదా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Bar License : ఏపీలో బార్ల లైసెన్సు ఫీజులు తగ్గింపు..ఎంతంటే !
ఈడీ అధికారుల ప్రకారం.. సాయిసూర్య డెవలపర్స్ కంపెనీ నుండి మహేష్ బాబుకు మొత్తం రూ.5.9 కోట్లు చెల్లింపులు జరిగినట్లు ఆధారాలు లభించాయి. ఇందులో రూ.3.4 కోట్లు చెక్కుల రూపంలో, మిగతా రూ.2.5 కోట్లు నగదు రూపంలో చెల్లించినట్లు గుర్తించారు. ఈ చెల్లింపుల నేపథ్యాన్ని వివరణ ఇవ్వాలని మహేష్‌ను విచారణకు పిలిపించారు. చెల్లింపుల వివరాలు, వాటి వెనుక గల సంబంధాలు స్పష్టత చేసేందుకు విచారణ అనివార్యమైంది.
మరి మహేష్ బాబు ఈ విచారణకు స్వయంగా హాజరవుతారా లేక అభ్యర్థించబోయే ఏదైనా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటారా అన్న దానిపై స్పష్టత రానుంది. పరిశ్రమ వర్గాలు, అభిమానులు భారీగా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ విచారణ మహేష్ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందా అన్నది కూడా చర్చనీయాంశమవుతోంది. నేటి పరిణామాలు సాయిసూర్య డెవలపర్స్ కేసు దర్యాప్తులో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.