Site icon HashtagU Telugu

Mahesh Babu Looks: మహేశ్ కొత్త లుక్ అదిరిపోయిందిగా.. ట్రెండీ లుక్స్ లో సూపర్ ఫిట్!

Mahesh

Mahesh

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలే కాకుండా అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగానూ ఉన్నారు. తాజాగా, ప్రముఖ మెన్స్ వేర్ బ్రాండ్ ఒట్టో కోసం మోడల్ అవతారం ఎత్తారు. ఒట్లో దుస్తులు, యాక్సెసరీస్ ధరించి మోడలింగ్ సెషన్ లో పాల్గొన్నాడు.ఇటీవల బాగా స్లిమ్ గా తయారైన మహేశ్ ఒట్టో ట్రెండీ కాజువల్స్ లో సూపర్ ఫిట్ గా కనిపిస్తున్నాడు. టీషర్టు, బ్లూ జీన్స్, కళ్లకు కూలింగ్ గ్లాసెస్, రిస్ట్ బ్యాండ్లతో నవతరం ప్రతినిధిగా దర్శనమిస్తున్నాడు.

దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ యాక్షన్ ఫైట్ సీక్వెన్స్ లు ఉంటాయి. మొదట పోరాట ఘట్టాలు చిత్రికరించిన తర్వాతనే ఇతర సీన్స్ తెరకెక్కుతాయి.

Exit mobile version