Rajinikanth: లాల్ సలామ్ సినిమాకు రజనీకాంత్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రజనీకాంత్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే

Published By: HashtagU Telugu Desk
Mixcollage 08 Feb 2024 08 02 Am 2649

Mixcollage 08 Feb 2024 08 02 Am 2649

సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రజనీకాంత్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 75 ఏళ్ల వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది జైలర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన రజినీకాంత్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా విడుదల అయ్యి దాదాపుగా 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇది ఇలా ఉంటే రజనీకాంత్ తాజాగా నటించిన చిత్రం లాల్ సలామ్. ఈ సినిమా ఈ నెల 9వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించింది. కాగా ఇందులో విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా నటించారు. జీవితా రాజశేఖర్, క్రికెట్ లెంజెండ్ క‌పిల్ దేవ్ త‌దిత‌రులు న‌టించారు. ఇది ఇలా ఉంటే తాజాగా హీరో రజనీకాంత్ రెమ్యూనరేషన్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు రజనీకాంత్ ఎంత పారితోషికం తీసుకున్నారనే వార్త ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది. అయితే లాల్ సలార్ సినిమాలో రజనీకాంత్ కేవలం అతిధి పాత్రలో కనిపించారు అన్న విషయం మనకు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ఆయన పాత్ర కనిపిస్తుంది. అలాగే ఆయన పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.

దాంతో రజనీకాంత్ ఈ పాత్రను అంగీకరించి నటించారు. రజనీకాంత్ పోషించిన పాత్ర పేరు మొయిద్దీన్ భాయ్. ఆ పాత్రలో ఆయన గెటప్ అందరినీ ఆకర్షిస్తోంది. లాల్ సలామ్ సినిమాలో ఈ పాత్ర దాదాపు 40 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. అందుకు గాను ఆయన 40 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారని తెలుస్తోంది. అంటే నిమిషానికి కోటి రూపాయలు వసూలు చేసినట్లే. ఈ వార్త విన్న అభిమానులు షాక్ అవుతున్నారు. తన కూతురు దర్శకత్వం వహించిన సినిమా అయినప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదట సూపర్ స్టార్. 75 ఏళ్ల వయసులో కూడా నటించడంతో పాటు 40 కోట్లు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు అంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు.

  Last Updated: 08 Feb 2024, 08:04 AM IST