Site icon HashtagU Telugu

Mahesh super Makeover : క్యాప్ తో మహేష్.. ఏం జరుగుతుంది.. సూపర్ స్టార్ లేటెస్ట్ లుక్ చూశారా..?

Super Star Mahesh Super Makeover For Rajamouli Movie

Super Star Mahesh Super Makeover For Rajamouli Movie

Mahesh super Makeover సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో వస్తుంది. ఈ సినిమా ను ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో నెక్స్ట్ లెవెల్ గా తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఈ సినిమా కోసమే మహేష్ జర్మనీ వెళ్లాడు.

అయితే ఈ సినిమా లో మహేష్ లుక్ కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. అందుకే జర్మనీ వెళ్లొచ్చిన దగ్గర నుంచి మహేష్ ఎక్కడ కనిపించినా సరే క్యాప్ తో ఉంటున్నాడు. జర్మనీ వెళ్లెప్పుడు వచ్చిన తర్వాత క్యాప్ మాత్రం తీయట్లేదు. లేటెస్ట్ గా నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి పెళ్లి ఆహ్వాన పత్రికతో మహేష్ ని ఆహ్వానించారు.

మహేష్ నమ్రతకు పెళ్లి కార్డ్ ఇచ్చారు దిల్ రాజు ఫ్యామిలీ. ఈ ఫోటోలో కూడా మహేష్ బాబు క్యాప్ తో ఉన్నారు. మహేష్ క్యాప్ తో ఉన్న ఫోటో లు చూసి ఫ్యాన్స్ అంతా కూడా రాజమౌళి సినిమా కోసం ప్రిపరేషన్స్ అని అనుకుంటున్నారు. మహేష్ రాజమౌలి కాంబో మూవీని కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో నటించే మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. సినిమాను రాజమౌళి నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నరట. యాక్షన్ సీన్స్.. విజువల్ ఫీస్ట్ గా సినిమా ఉండబోతుందని స్క్రిప్ట్ కూడా అదిరిపోయే రేంజ్ లో వచ్చినట్టు తెలుస్తుంది.

Also Read : Prabhas : ప్రభాస్ తో కూడా ఆ హీరోయినే.. యానిమల్ డైరెక్టర్ ప్లాన్ అదుర్స్..!