Site icon HashtagU Telugu

Krishna : సూపర్ స్టార్ కృష్ణ తీసిన బాహుబలి లాంటి సినిమా.. అప్పట్లోనే భారీ బడ్జెట్, రికార్డులు..

Super Star Krishna Simhasanam Movie Interesting Facts

Super Star Krishna Simhasanam Movie Interesting Facts

టాలీవుడ్ హీరో కృష్ణకి(Krishna) ‘సూపర్ స్టార్'(Super Star) అనే ట్యాగ్ కాకుండా మరో ట్యాగ్ కూడా ఉంది. అదే డేరింగ్ అండ్ డాషింగ్ హీరో. తెలుగు సినిమా చరిత్రలో ఈయన చేసిన సాహసాలు ఇంకెవరు చేయలేదు అనడంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. కొత్త టెక్నాలజీస్ తీసుకువస్తూ గొప్ప సినిమాలు తెరకెక్కిస్తున్నారని ఇప్పటి దర్శకులను మనం పొగుడుతున్నాము. కానీ అలాంటి ఎన్నో టెక్నాలజీస్‌ని కృష్ణ పరిచయం చేయడం వలనే తెలుగు సినిమా పరిశ్రమ ఇలా ఉంది అని చెప్పొచ్చు. అలా కృష్ణ చేసిన ఓ బాహుబలి ప్రయత్నం గురించి మాట్లాడుకుందాం.

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా రూపురేఖలే మారిపోయాయి. అయితే అలాంటి ఓ ప్రయత్నం కృష్ణ 1986లో చేశారు. ‘సింహాసనం'(Simhasanam) అనే ఒక అద్భుతమైన సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ సినిమాకి.. కథా రచయిత, దర్శకుడు, ఎడిటర్, నిర్మాత, హీరోగా వ్యవహరించి కృష్ణ నిజమైన సూపర్ స్టార్ అనిపించారు. ఈ చిత్రాన్ని ఒకే సమయంలో తెలుగు, హిందీ రెండు భాషల్లో తెరకెక్కించారు.

తెలుగులో తానే నటిస్తూ దర్శకత్వం వహించిన కృష్ణ.. హిందీ వెర్షన్ లో మాత్రం బాలీవుడ్ నటుడు ‘జితేంద్ర’ని హీరోగా పెట్టి డైరెక్ట్ చేశారు. ఇక తెలుగు వెర్షనే తమిళంలో డబ్ చేశారు. జయప్రద, రాధ, కాంతారావు, కైకాల, గుమ్మడి.. వంటి భారీ స్టార్ క్యాస్ట్‌తో భారీ సెట్స్‌తో, భారీ సినిమా యూనిట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాని తెరకెక్కించడానికి దాదాపు 3 కోట్ల పైనే ఖర్చు అయ్యిందట. అప్పటిలో మూడు కోట్ల పెట్టి సినిమా అంటే బాహుబలి బడ్జెట్ లాంటిది.

సినిమా ప్లాప్ అయితే ఇంక నిర్మాత పని అంతే. కానీ ప్రొడ్యూసర్ గా కూడా కృష్ణనే వ్యవహరిస్తూ డేర్ చేసి సినిమా తెరకెక్కించారు. ఇక రిలీజైన మొద‌టి వారంలోనే ఈ మూవీ రూ.1.51 కోట్ల గ్రాస్‌ని సాధించింది. ఆ తరువాత పెట్టిన పెట్టుబడి రాబట్టడంలో పెద్ద ఆలస్యం కాలేదు. హిందీలో కూడా ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాహుబలి లాగానే హిందీ కలెక్షన్స్ ఈ చిత్రానికి కూడా చాలా సహాయపడ్డాయట. దీంతో ఊహించిన దానికంటే.. ఈ మూవీ కలెక్షన్స్ ఓ రేంజ్ లో వచ్చాయట. ఇక ఈ సినిమాలోని ఆకాశంలో ఒక తార.. సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకి తెలిసిందే. ఇప్పటికి ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది.

 

Also Read : Suma Kanakala : బాబోయ్.. రెచ్చిపోయి సుమక్క ఫోటోషూట్.. భర్త రాజీవ్ రియాక్షన్స్ చూశారా?