ఇటీవల కాలంలో యువత ఎక్కువగా చర్చించుకుంటున్న సినిమా ప్రేమలు. మొదట మలయాళంలో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమాను డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ గా నలిచింది. కేవలం రూ. 1.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ నాలుగు రోజులకే టార్గెట్ ఫినిష్ చేసింది. ఇక ఇప్పటివరకు దాదాపు ఆరు కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
ప్రమోషన్స్ పెద్దగా లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం తెలుగులో మాత్రం రికార్డ్స్ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ యూత్ కు కనెక్ట్ అయ్యింది. డైరెక్టర్ గిరీశ్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ టీనేజ్ రొమాంటిక్ లవ్ స్టోరీలో మలయాళీ యంగ్ హీరో నస్లెన్, హీరోయిన్ మమిత బైజు జంటగా నటించారు. ఈ చిత్రాన్ని పుష్ప నటుడు ఫహద్ ఫాజిల్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో శ్యామ్ మోహన్, మీనాక్షి రవీంద్రన్, అఖిలా భార్గవన్, అల్తాఫ్ సలీం, మాథ్యూ థామస్, సంగీత్ ప్రతాప్ కీలకపాత్రలలో నటించారు.
ఈ చిత్రానికి కాలేజీ స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ మేరకు ఈ సినిమా ఓటీటీ డేట్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మూవీని మార్చి 29 నుంచి తెలుగు, మలయాళం, తమిళం భాషలలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ఈ సినిమాకు విష్ణు విజయ్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో చూడాలి మరి..