Sunny Leone: పెళ్ళికి ముందే నన్ను మోసం చేశాడు.. మాజీ ప్రియుడి గురించి సంచలన వాఖ్యలు చేసిన సన్నిలియోన్?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శృంగార తారగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సన్నీలియోన్. ఎన్నో సినిమాలలో ఐటెం సాంగ్స్ చేసి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. మొదట అశ్లీల చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన సన్నీ లియోన్ ఆ తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంది. తక్కువ సమయంలో సన్నీలియోన్ బాలీవుడ్ లో క్రేజీ నటిగా మారింది. తెలుగులో కూడా సన్నీ లియోన్ కొన్ని చిత్రాల్లో నటించింది. We’re now on WhatsApp. […]

Published By: HashtagU Telugu Desk
Sunny Leone

Sunny Leone

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శృంగార తారగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సన్నీలియోన్. ఎన్నో సినిమాలలో ఐటెం సాంగ్స్ చేసి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. మొదట అశ్లీల చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన సన్నీ లియోన్ ఆ తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంది. తక్కువ సమయంలో సన్నీలియోన్ బాలీవుడ్ లో క్రేజీ నటిగా మారింది. తెలుగులో కూడా సన్నీ లియోన్ కొన్ని చిత్రాల్లో నటించింది.

We’re now on WhatsApp. Click to Join
సన్నీలియోన్ ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు తన భర్త డేనియల్ వెబర్, పిల్లలతో హ్యాపీగా ఉంది. అయితే డానియల్ వెబర్ కన్నా ముందు సన్నీలియోన్ ఒక వ్యక్తిని ప్రేమించిందట. కానీ అతడి వల్ల లైఫ్ లో మరచిపోలేని బాధని అనుభవించినట్లు సన్నీ లియోన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. అతడితో ఎంగేజ్ మెంట్ కూడా అయింది. ఆ తర్వాత అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. నన్ను మోసం చేస్తున్నాడని చాలా బలంగా అనిపించింది. మరో రెండు నెలల్లో మా పెళ్లి ఉంది. పెళ్లి బట్టలు కూడా కొన్నాము. కానీ రోజు రోజుకి అతడి ప్రవర్తనలో మార్పు కనిపిస్తూ వచ్చింది. ఒక రోజు విసిగిపోయాను.

Also Read: Vijay Devarakonda: ఆ కారణం వల్లే విజయ్ పై నెగిటివిటి పెరిగిందా.. భారీగా ట్రోల్స్!

చివరికి నిజాయతీగా చెప్పు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని అడిగేశాను. అతడు కూడా ఓపెన్ అయ్యాడు.. నీ మీద నాకు ప్రేమ లేదని చెప్పేశాడు. నా హార్ట్ బ్రేక్ అయినట్లు అయింది. అతడి వల్ల చాలా రోజులు మానసికంగా కుంగిపోయాను అని తెలిపింది సన్నీ లియోన్. కానీ దేవుడు నా కోసం మరో అద్భుతం చేశాడు. డేనియల్ వెబర్ ని నా జీవితంలోకి పంపాడు. డేనియల్ నన్ను ప్రేమించడమే కాదు నా కష్టాల్లో సైతం తోడున్నాడు. మా అమ్మ నాన్న మరణించినప్పుడు నన్ను నాకు తోడుగా నిలబడింది ఇప్పుడున్న నా భర్తే అంటూ డేనియల్ పై సన్నీలియోన్ ప్రశంసలు కురిపించింది సన్నీ.

Also Read; RC 16: రామ్ చరణ్ కు తాతయ్యగా అమితాబ్.. ఏ సినిమాలో అంటే?

  Last Updated: 07 Apr 2024, 02:09 PM IST