Site icon HashtagU Telugu

Singer Kalpana: వెంటిలేటర్ పై సింగర్ కల్పనా.. హాస్పిటల్ కు చేరుకున్న గాయని సునీత!

Singer Kalpana

Singer Kalpana

టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పన గురించి మనందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలకు పాటలు పాడి సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినీ కళామతల్లికి సుమారు 27 ఏళ్లుగా సేవలందిస్తున్నారు సింగర్ కల్పన. కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‏గా, నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటిది ఆమె తాజాగా ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. నిద్ర మాత్రలు మింగి బలవన్మరణానికి యత్నించడంతో స్థానికులు ఆమెను వెంటనే హైదరాబాద్ నగరంలోని హోలిస్టిక్ ఆస్పత్రిలో చేర్పించారు.

ప్రస్తుతం కల్పనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె స్పృహలోకి వచ్చారని అంన్నారు. అటు కల్పన ఆత్మహత్యాయత్నానికి ఇంకా సరైన కారణాలను మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అయితే ప్రాథమిక విచారణలో భాగంగా పోలీసులు కల్పన రెండో భర్త ప్రసాద్ ప్రభాకర్ ను విచారిస్తున్నారు. అయితే ఆయన కూడా తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పినట్లు సమాచారం. మరిన్ని వివరాల సేకరణకు ప్రసాద్‌ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. మొబైల్ కూడా‌ స్వాధీనం చేసుకున్నారట.

 

మరోవైపు సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలయగానే సినీ ప్రముఖులు షాక్ అయ్యారు. ఇప్పటికే కొంతమంది సింగర్ ను పరామర్శించేందుకు ఆసుపత్రికి క్యూ కట్టారు. ఈ క్రమంలోనే ప్రముఖ సింగర్ సునీత కల్పన చికిత్స పొందుతోన్న హాస్పిటల్‎కి చేరుకుని ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కల్పన కు మెరుగైన వైద్యం అందేలా చూడాలని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు సునీత. సునీతతో పాటు గీతా మాధురి, కారుణ్య తదితరులు కల్పనను పరామర్శించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె తొందరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.