Sunil : సునీల్ ఆన్ డిమాండ్..!

Sunil కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ కమెడియన్ గా మారి ఆ తర్వాత హీరోగా కొన్ని ప్రయత్నాలు చేసి విఫలమై మళ్లీ

Published By: HashtagU Telugu Desk
Sunil On Demand In Kollywoo

Sunil On Demand In Kollywoo

Sunil కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ కమెడియన్ గా మారి ఆ తర్వాత హీరోగా కొన్ని ప్రయత్నాలు చేసి విఫలమై మళ్లీ తన పాత పంథాలో సినిమాలు చేస్తున్న సునీల్.. హీరో కమెడియన్ అయిపోయింది సరదాగా ఒకసారి విలంగా ట్రై చేస్తే పోలా అన్న ఆలోచన వచ్చింది. అలా వచ్చిన ఆలోచనని అప్లై చేస్తే ఊహించని ఫలితాలు వచ్చాయి. కలర్ ఫోటో, పుష్ప 1 సినిమాల్లో సునీల్ విలనిజం ఆకట్టుకుంది.

మన దగ్గరే కాదు ఇన్నేళ్ల కెరీర్ లో సునీల్ కు కోలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వచ్చాయి. తమిళంలో మహావీరన్, జైలర్, మార్క్ ఆంటోని ఇలా వరుస ఛాన్స్ లు సునీల్ ఖాతాలో పడ్డాయి. ప్రతి సినిమాలో సునీల్ డిఫరెంట్ లుక్, డిఫరెంట్ క్యారెక్టర్ తో కనిపించారు. తమిళంలో తనకు వచ్చిన ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్నారు సునీల్. కెరీర్ కమెడియన్ గా మంచి పీక్స్ లో ఉన్నప్పుడు ఎలాగైతే డిమాండ్ చేస్తున్నాడో ఇప్పుడు వెరైటీ పాత్రలకు కూడా సునీల్ అంతే డిమాండ్ చేస్తున్నాడట.

అయినా కూడా అతను కోరిన రెమ్యునరేషన్ ఇచ్చి మరీ సునీల్ ని తీసుకుంటున్నారని తెలుస్తుంది. సునీల్ నటిస్తున్న తమిళ సినిమాలన్నీ వర్క్ అవుట్ అవుతుండటంతో అతనికి అక్కడ వరుస ఛాన్స్ లు వస్తున్నాయి. తెలుగులో అయితే సునీల్ కొత్త ఇమేజ్ తెచ్చుకోవడం కష్టం కానీ తమిళంలో సునీల్ కి విలన్ ఇమేజ్ తో దూసుకెళ్తున్నాడు.

ఇలానే కొనసాగితే ప్రస్తుతం అక్కడ ఇక్కడ సినిమాలు చేస్తున్న Sunil పూర్తిగా తమిళ సినిమాలు చేసే అవకాశం కూడా ఉంది. తెలుగులో ప్రస్తుతం పుష్ప 2 ఒక్కటే చేస్తున్న సునీల్ ఈ ఇయర్ 3 సూపర్ హిట్ తమిళ సినిమాల్లో నటించాడు. ఈ సినిమాల రిఫరెన్స్ తో సునీల్ కి కోలీవుడ్ నుంచి మరికొన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్పొచ్చు.

Also Read : Megastar : ఆ చిరంజీవిని చూపిస్తానంటున్న డైరెక్టర్.. మెగా ప్లానింగ్ అదుర్స్..!

  Last Updated: 22 Sep 2023, 10:29 PM IST