Sundeep Kishan: టిల్లు స్క్వేర్ దర్శకుడితో హీరో సందీప్ కొత్త వెబ్ సిరీస్?

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ గురించి మనందరికీ తెలిసిందే. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతు

  • Written By:
  • Publish Date - March 31, 2024 / 07:51 AM IST

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ గురించి మనందరికీ తెలిసిందే. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు సందీప్. ఇది ఇలా ఇంటే సందీప్ కిషన్ తాజాగా నటించిన చిత్రం ఊరు పేరు భైరవకోన. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించింది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, అనిల్ సుంకర నిర్మించారు. ఇందులో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్ లుగా నటించారు. అయితే సందీప్ కిషన్ కి గత మూడేళ్ళుగా ఒక్క హిట్ రావడం లేదు.

చివరిగా 2021లో A1 ఎక్స్‌ప్రెస్ సినిమాతో హిట్ అందుకున్న సందీప్ కిషన్.. ఆ తరువాత గల్లీ రౌడీ, మెఖైల్, ఊరు పేరు భైరవకోన సినిమాలతో వచ్చి సరైన సక్సెస్ ని నమోదు చేయలేకపోయారు. ప్రస్తుతం ఈ హీరో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ప్లీజ్ సినిమా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ డైరెక్టర్ స్వరూప్ RSJ దర్శకత్వంలో ఒక సినిమాని చేస్తున్నారు. ఈ రెండు కాకుండా ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారట సందీప్. తాజాగా ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న టిల్లు స్క్వేర్ దర్శకుడు మల్లిక్ రామ్ తో ఈ సిరీస్ ని చేయబోతున్నారట.

అల్లరి నరేష్ తో ఆ ఒక్కటి అడక్కు సినిమాని నిర్మిస్తున్న రాజీవ్ చిలుక ఈ సిరీస్ కి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారట. నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ గా ఈ వెబ్ సిరీస్ ఆడియన్స్ ముందుకు రానుందట. అయితే ఈ సిరీస్ ఎటువంటి సబ్జెట్ తో రాబోతుంది అనేది తెలియాల్సి ఉంది. కాగా సందీప్ కిషన్ గతంలో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో ఒక ముఖ్య పాత్ర చేసారు. ఆ తరువాత మళ్ళీ ఇప్పుడే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఇక సందీప్ నటిస్తున్న కొత్త సినిమాల విషయానికి వస్తే.. ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ ని అందుకున్న త్రినాథరావు నక్కిన, ప్రసన్న కుమార్ కాంబినేషన్ లో సందీప్ తన 30వ సినిమాని చేస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్న ఈ చిత్రం కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని సమాచారం. ఇక RSJ దర్శకత్వంలో చేయబోయే సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి వైబ్ అనే టైటిల్ ని ఖరారు చేసారు. స్వధర్మ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మరి ఈ రెండు సినిమాలతో సందీప్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారో లేదో చూడాలి మరి.