Ooru Peru Bhairavakona: కలెక్షన్ల పరంగా అదరగొడుతున్న సందీప్ కిషన్ సినిమా.. విడుదల కాకముందే ఏకంగా అన్ని కోట్లు?

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ తాజాగా నటించిన చిత్రం ఊరి పేరు భైరవకోన. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన సోషియో ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం నేడు అనగా ఫిబ్

Published By: HashtagU Telugu Desk
Mixcollage 16 Feb 2024 11 11 Am 6567

Mixcollage 16 Feb 2024 11 11 Am 6567

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ తాజాగా నటించిన చిత్రం ఊరి పేరు భైరవకోన. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన సోషియో ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం నేడు అనగా ఫిబ్రవరి 16న రిలీజ్ అయ్యింది. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అండ్ టీజర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోవడంతో మూవీ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అంతేకాకుండా ఇటీవల ఇలాంటి జోనర్స్ లో వచ్చిన కొన్ని సినిమాలు టాలీవుడ్ ఆడియన్స్ ని బాగా థ్రిల్ చేయడంతో మూవీ రిలీజ్ పై మంచి బజ్ నెలకుంది.

దీంతో ఈ మూవీ రిలీజ్ కి ముందే కోటి రూపాయలకు పైగా కలెక్షన్స్ ని నమోదు చేసి మేకర్స్ ని ఖుషి చేస్తుంది. అయితే ఈ మూవీని పెయిడ్ ప్రీమియర్స్ తో రిలీజ్ కి రెండు రోజులు ముందుగానే థియేటర్స్ లోకి తీసుకు వచ్చేసారు. నిన్న బుధవారం రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని సిటీస్ లో ఈ పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయి. తాజాగా గురువారం కూడా పెయిడ్ ప్రీమియర్స్ పడాయి. ఇక ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ రావడంతో మూవీ పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది.

ఇకపోతే ఈ రెండు రోజుల ప్రీమియర్స్ కలెక్షన్స్ విషయానికి వస్తే దాదాపు రూ.1.1 కోటికి పైగా కలెక్షన్స్ ని రాబట్టిందట. ఇక ఈ ప్రీమియర్ కలెక్షన్స్ తోనే సందీప్ తన కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ ని అందుకున్నట్లు తెలుస్తోంది. మరి నేడు మంచి బజ్ తో రిలీజ్ అయిన ఈ చిత్రం ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని నమోదు చేస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్ ని బట్టి చూస్తే ఈ మూవీతో సందీప్ కిషన్ సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అని తెలుస్తోంది.

  Last Updated: 16 Feb 2024, 11:13 AM IST