Site icon HashtagU Telugu

Sundeep Kishan : హిట్టు డైరెక్టర్ తో సందీప్ కిషన్.. యువ హీరో పర్ఫెక్ట్ ప్లాన్..!

Sundeep Kishan Next Movie With Hit Director

Sundeep Kishan Next Movie With Hit Director

Sundeep Kishan కొన్నాళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న యువ హీరో సందీప్ కిషన్ ఫైనల్ గా ఊరు పేరు భైరవ కోన సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. సినిమా రిలీజ్ అయిన నాడు టాక్ మామూలుగానే ఉన్నా సినిమా వసూళ్లు మాత్రం అదిరిపోయాయి. ఫైనల్ గా సందీప్ కిషన్ ఖాతాలో ఒక సూపర్ హిట్ పడింది. ఇక ఇదే జోష్ లో తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ చేస్తున్నాడు సందీప్ కిషన్. సందీప్ కిషన్ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు డైరెక్షన్ లో ఒక సినిమా వస్తుంది.

ఏకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుంది. ధమాకా తర్వాత నక్కిన త్రినాథ రావు మరో సినిమా చేయలేదు. హిట్ డైరెక్టర్ హిట్ హీరో హిట్ ప్రొడ్యూసర్ ఇలా అందరు కలిసి ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇవ్వాలని చూస్తున్నారు. ఈ సినిమా కథ ఏంటి మిగతా కాస్టింగ్ ఏంటన్నది త్వరలో తెలుస్తుంది. సందీప్ కిషన్ ఈ సినిమా తో మరోసారి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.

యువ హీరోల్లో టాలెంట్ ఉన్నా కూడా ఇప్పటికీ కెరీర్ లో వెనకబడి ఉన్నాడు సందీప్ కిషన్ అతను చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఫైనల్ గా వి ఐ ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన ఊరు పేరు భైరవకోన సినిమాతో హిట్ అందుకున్నాడు.

Also Read : NTR Simhadri : సింహాద్రి రీ రిలీజ్.. ఈసారి ఫ్యాన్స్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్..!