Site icon HashtagU Telugu

Mahesh Babu: సమ్మర్ ఎఫెక్ట్.. ఫ్యామిలీతో కలిసి విదేశాలకు మహేశ్ బాబు!

Mahesh

Mahesh

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ప్రతి సమ్మర్ (Vacation) లో ఫ్యామిలీతో కలిసి ఇష్టమైన ప్లేసుకు వెకేషన్ కోసం వెళ్తుంటాడు. తాజాగా మహేష్ బాబు ఫ్యామిలీ (Family)తో మరోసారి విదేశాలకు పయనం అయ్యారు. ఇవాళ హైదరాబాద్ (Hyderabad)  విమానాశ్రయంలో కనిపించారు. షూటింగ్ గ్యాప్లో వీలున్నప్పడు ఇలా వెళ్లడం ఆయనకు అలవాటు. పిల్లలకు వేసవి సెలవులు దొరకడంతో ఇలా బయలు దేరారు. మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్, సితార ఘట్టమనేని, గౌతమ్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు.

తాగాగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ కాంబినేషన్లో SSMB 28 సినిమాతో హ్యాట్రిక్ మీద గురి పెట్టారు. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల ముగిసింది. మహేష్, పూజా హెగ్డే  పాల్గొనగా  కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు. మహేశ్ (Mahesh Babu) తిరిగి వచ్చాక షూటింగ్ చేయనున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ వాయిదా పడిందనే వార్తలపై మేకర్స్ స్పందించిన విషయం తెలిసిందే.

Also Read: Shirdi Closed: బాబా భక్తులకు బ్యాడ్ న్యూస్.. త్వరలో షిర్డీ బంద్!