అక్కినేని కుటుంబంలో మరోసారి పెళ్లి శుభవార్త వినిపించే సూచనలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్‌లో తాజా టాక్ ప్రకారం..హీరో సుమంత్ త్వరలో ఓ హీరోయిన్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కొంతకాలంగా వీరి సంబంధం సన్నిహితులకు తెలిసే స్థాయికి వచ్చిందని, ఇప్పుడు ఇది పెళ్లివరకు వెళ్లబోతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
AIADMK: నీట్ పై సీఎం స్టాలిన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి!
ఇప్పటికే ఇరు కుటుంబాల మధ్య సంప్రదింపులు పూర్తయ్యాయని, పెళ్లికి ఓకే కూడా చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అభిమానులు మాత్రం సుమంత్ పెళ్లిపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొంతకాలంగా సినిమాలకన్నా వ్యక్తిగత జీవితం విషయాల్లోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సుమంత్ త్వరలో పెళ్లిపై స్పష్టత ఇవ్వబోతున్నారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
సుమంత్ గతంలో 2004లో హీరోయిన్ కీర్తి రెడ్డిను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వివాహం తర్వాత కొన్ని కారణాలతో 2006లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సుమంత్ వ్యక్తిగత జీవితం ఎంతో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మళ్లీ ఆయన పెళ్లి వార్తలు వెలుగులోకి రావడం అభిమానుల హర్షాన్ని కలిగిస్తోంది. మరి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.