Nenokkadine Re Release: మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడినే సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ సినిమా స్క్రీన్ ప్లే జనాలకు అస్సలు ఎక్కలేదు. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు రుచించలేదు. మొత్తానికి భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమా మెప్పించలేకపోయింది. ఈ సినిమా ద్వారా సుకుమార్ స్థాయి మరింత పెరిగిందనే చెప్పాలి. గొప్ప స్క్రీన్ ప్లే అందించాడని విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే మహేష్ ని చూపించిన విధానంపై మహేష్ అభిమానులు పెదవి విరిచారు. కాగా.. ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తే కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. గతంలో ప్లాప్ అయిన చిత్రాలు రీ రిలీజ్ చేయగా మంచి విజయాన్ని అందుకుంటున్నాయి.
ఈ మధ్య రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాను రిలీజ్ చేయగా… ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. దాదాపుగా 50 కోట్లకు పైగానే రాబట్టినట్లు సినిమా వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పుడు 1 నేనొక్కడినే సినిమాపై సుకుమార్ భార్య తబిత చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తన భర్త దర్శకత్వం వహించిన 1 నేనొక్కడినే రీ రిలీజ్ కు పట్టుబడుతున్నారు. ఆమె. ఈ విషయాన్నీ సుక్కుతో షేర్ చేసుకున్నారట. 1 నేనొక్కడినే సినిమాను రీ రిలీజ్ చేయాలని ఆమె సుకుమార్ ని రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. ఏదిఏమైనా భార్య కోరిక మేరకు 1 నేనొక్కడినే సినిమా త్వరలోనే థియేటర్లో సందడి చేయనుంది. ఇక ఈ సినిమాతో పాటు రామ్ నటించిన జగడం సినిమాని కూడా ఆమె రీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. భారీ విజయం అందుకున్న పుష్పాకు సీక్వెల్ [పనిలో ఉన్నాడు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచాలున్నాయి. పుష్ప సినిమాలో బన్నీకి జంటగా రష్మిక నటిస్తుండగా… మహేష్ కి జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది.
Read More: From Actress to Cinematographer: అనుపమ పరమేశ్వరన్ కెమెరా వెనుక కొత్త పాత్ర