Site icon HashtagU Telugu

Allu Arjun : లెక్కల మాస్టర్ ‘లెక్క’ తప్పు

Bunny Svr

Bunny Svr

అల్లు అర్జున్ (Allu Arjun) ను ఏకంగా సీనియర్ నటుడు SVR (SV Ranga rao) తో డైరెక్టర్ సుకుమార్ పోల్చడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కిన పుష్ప 2 భారీ విజయం సాధించిన నేపథ్యంలో శనివారం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసారు. గతంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో ఉంచుకొని , ఈసారి ఎలాంటి హడావిడి , ఆర్భాటాలు చేయకుండా చాల సింపుల్ గా , రహస్యంగా ఈవెంట్ జరిపారు. కాగా ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ…అల్లు అర్జున్ ను ఏకంగా SVR (SV రంగారావు) తో పోల్చడం పై చాలామంది విమర్శలు చేస్తున్నారు.

Driving License Test: డ్రైవింగ్‌ లైసెన్స్ టెస్ట్.. ఇక మరింత టఫ్.. ఎందుకో తెలుసా ?

భార‌తీయ చ‌ల‌న చిత్ర రంగంలోనే ఎస్వీఆర్‌ని కొట్టే ఆర్టిస్టు ఇప్ప‌టి వ‌ర‌కూ పుట్ట‌డు.. పుట్ట‌బోడు. అలాంటి ఎస్వీఆర్ తో బ‌న్నీని పోల్చ‌డం ఏమాత్రం బాగాలేదు. ఒక‌వేళ అభిమానులు సుకుమార్ ద‌గ్గ‌ర ఈ విష‌యాన్ని స‌రిగ్గా చెప్పిన‌ట్టే ప్ర‌స్తావించి, త‌మ అభిమానాన్ని చాటుకొని ఉండొచ్చు. కానీ.. దాన్ని సుకుమార్ మ‌న‌సులోనే దాచుకోవాల్సింది. ఎందుకంటే సుకుమార్ లాజిక్కుల్లో దిట్ట‌. `ఎస్వీఆర్‌… బన్నీ.. పోలిక లేదు క‌దా` అని మ‌న‌సులోనే అనుకొని, దాన్ని అక్క‌డే నిక్షిప్తం చేయాల్సింది. దాన్ని అంద‌రి ముందూ బ‌య‌ట పెట్టాడు. అప్ప‌టిక‌ప్పుడు ఈ పోలిక వేదిక ముందున్న‌వాళ్ల‌నీ, ముఖ్యంగా అల్లు అర్జున్‌నీ, ఆయ‌న అభిమానుల్ని సంతోష‌ప‌రిచి ఉండొచ్చు,. కానీ కాసేప‌య్యాక ఆలోచిస్తే.. ‘ఈ పోలిక ఎంత దారుణం’ అని స్వ‌యంగా సుకుమార్‌కే అనిపించి ఉండొచ్చు అని నెటిజన్లు కామెంట్స్ వేస్తున్నారు. అల్లు అర్జున్ ఐకాన్ స్టార్..జాతీయ అవార్డు వ‌చ్చింది కాబ‌ట్టి, న‌టుడిగా ఇంకాస్త గౌర‌వాన్ని సంపాదించుకొన్నాడు. ఇందుకని చెప్పి వేరే హీరోలతో పోల్చి ఆయన్ను తక్కువ చెయ్యకండి అంటూ కొంతమంది బన్నీ ఫ్యాన్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి అల్లు అర్జున్ ను SVR తో పోల్చడం చాలామందికి నచ్చడం లేదు.