Arya : ‘ఆర్య’ కథని మొదటిగా రవితేజ, ప్రభాస్ విన్నారు.. కానీ అల్లు అర్జున్..

'ఆర్య' కథని మొదటిగా రవితేజ, ప్రభాస్ కి చెప్పిన సుకుమార్. కానీ ఆ తరువాత అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చి..

Published By: HashtagU Telugu Desk
Sukumar Narrating Arya Story To Raviteja Prabhas Before Allu Arjun

Sukumar Narrating Arya Story To Raviteja Prabhas Before Allu Arjun

Arya : బ్లాక్ బస్టర్ కాంబినేషన్ సుకుమార్, అల్లు అర్జున్ కలిసి చేసిన మొదటి సినిమా ‘ఆర్య’. దర్శకుడిగా సుకుమార్ కి ఇది మొదటి సినిమా. నిర్మాత దిల్ రాజు, అల్లు అర్జున్ కి రెండో సినిమా. 2004 మే 7న రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడమే కాకుండా.. అల్లు అర్జున్, సుకుమార్, దిల్ రాజు కెరీర్ కి బూస్ట్ ని ఇచ్చింది. నిన్నటితో ఈ సినిమా రిలీజయ్యి 20 ఏళ్ళు అవ్వడంతో.. చిత్ర యూనిట్ రీ యూనియోన్ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీలో చిత్ర యూనిట్ అంతా హాజరయ్యి.. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంబరపడ్డారు.

ఈక్రమంలోనే దిల్ రాజు, సుకుమార్ కలిసి తమ హీరోని ఎలా ఎంపిక చేసుకున్నారో తెలియజేసారు. మొదటిగా ఈ సినిమాని రవితేజ, ప్రభాస్ తో చేయాలని అనుకున్నారట. వారిద్దరికీ కథలు కూడా వినిపించారట. ప్రభాస్ కి కథ వినిపించేటప్పుడు అయితే సుకుమార్ ఇలా చెప్పారట.. సార్ మీకు ఈ కథ సెట్ అవ్వదు. కానీ దిల్ రాజు గారు చెప్పమన్నారని చెబుతున్నా అని చెప్పారట. కథ విన్న తరువాత ప్రభాస్ మాట్లాడుతూ.. నువ్వు చెప్పింది నిజమే నాకు ఈ కథ సెట్ అవ్వదు అని అన్నారట.

హీరో ఎవరు సెట్ అవ్వకపోవడంతో దిల్ రాజు, సుకుమార్ డైలమాలో పడ్డారు. ఆ సమయంలో వీరిద్దరికి అల్లు అర్జున్ కనిపించారు. సుకుమార్, అల్లు అర్జున్ ని చూసిన వెంటనే.. తన పాత్రకి అతనే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యిపోయారట. బన్నీ చూసిన వెంటనే దిల్ రాజుతో చెప్పారట. కానీ దిల్ రాజు మొదటిలో ఒప్పుకోలేదట. కానీ తరువాత కన్విన్స్ అయ్యారు. అల్లు అర్జున్ పిలిపించి సుకుమార్ తో కథ వినిపించారు. బన్నీకి కథ బాగా నచ్చేసేంది. సినిమా చేద్దామని చెప్పారట.

కానీ ఆ తరువాత అల్లు అర్జున్ నుంచి కొన్నిరోజుల పాటు ఎటువంటి రెస్పాన్స్ రాలేదట. కొన్నిరోజుల తరువాత ఒక మధ్య వ్యక్తి ద్వారా దిల్ రాజు అల్లు అర్జున్ ని సంప్రదించారు. దీంతో ఆర్య మళ్ళీ ట్రాక్ ఎక్కింది. అలా మొదలైన సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్.. ఆర్య 2, పుష్ప, పుష్ప 2 తో ఆడియన్స్ ముందుకు వచ్చారు.

  Last Updated: 08 May 2024, 08:19 AM IST