Site icon HashtagU Telugu

Sukumar: విషాదమా.. సుఖాంతమా.. ‘పుష్ప-2’ క్లైమాక్స్ పై ‘సుక్కు’ డైలమా!

Sukumar

Sukumar

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న పుష్ప మూవీ అంచనాలకు మించి ఓ రేంజ్ విజయం సాధించింది. టాలీవుడ్, కోలివుడ్, బాలీవుడ్ అని తేడా లేకుంటా అంతటా మంచి వసూళ్లను సాధించింది. అయితే పుష్ప పార్ట్-1 లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాడో.. అలాంటి జాగ్రత్తలు రెండో పార్ట్ లోనూ ఉండేలా చూసుకుంటున్నాడు సుకుమార్.

ఇప్పటికే ‘పుష్ప 2’ స్క్రిప్ట్‌ రైటింగ్‌ పనులు చకచకా జరుగుతున్నాయి. కానీ దర్శకుడు సుకుమార్ మాత్రం “పుష్ప” పార్ట్ 2 ముగింపు విషయంలో డైలమాలో ఉన్నట్లు టాలీవుడ్ టాక్. టైటిల్ లో చెప్పినట్లుగా రెండో భాగం శేషాచలం అడవులకు డాన్‌గా పుష్పరాజ్ రూలింగ్, IPS అధికారి షెకావత్‌తో హోరాహోరీగా పోరాట సన్నివేశాలుంటాయి. ఇదే కాన్సెప్ట్ తో కథ ముగించాలి. అయితే దీన్ని హ్యాపింగ్ ఎండ్ ఇవ్వాలా..  విషాదంతో ముగించాలా అనే విషయంలో అయోమయంలో సుకుమార్ ఉన్నాడు. క్లైమాక్స్ ను ఎలా ముగించాలనేది ఇప్పుడు సుక్కు ముందున్న ప్రశ్న.

మొదటి భాగం క్లైమాక్స్ లో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్ ఇద్దరినీ నగ్నంగా చిత్రీకరించాలనుకున్నానని, అయితే కొన్ని కారణాల వల్ల ఆ ఆలోచనను విరమించుకున్నానని సుకుమార్ వెల్లడించాడు. విషాదకరమైన రీతిలో సినిమా ముగిస్తే మన ప్రేక్షకులకు నచ్చదు. అందుకే, సుకుమార్ ఎండింగ్ ను ఎలా ముగించాలనే విషయమై తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. కాగా  ‘పుష్ప 2’ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది.