Site icon HashtagU Telugu

Sai Pallavi: సాయి పల్లవి.. ‘లేడీ పవన్ కళ్యాణ్’

Saipallavi

Saipallavi

నిన్న ఆదివారం ‘ఆడవాళ్లు మీకు జోహర్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి సుకుమార్ తోపాటు సాయిపల్లవి అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా సాయి పల్లవిని మెచ్చుకున్న ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్ ఆమెను ‘లేడీ పవన్ కళ్యాణ్’ అని పిలిచాడు. సాయి పల్లవి పేరు చెప్పగానే వచ్చిన రెస్పాన్స్ చూసి సుకుమార్‌తో సహా స్టేజ్‌పై ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. ప్రేక్షకులు కేకలు ఒక్కసారిగా కేకలు వేయడంతో సుకుమార్ తన స్పీచ్ ఆపాల్సి వచ్చింది.

“సాయి పల్లవి లేడీ పవన్ కళ్యాణ్‌గా కనిపిస్తుంది. ప్రజలు ఆమెను ఆరాధించడం ఎప్పటికీ ఆపలేరు” అని సుకుమార్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్‌కు ఉన్నంత ఫాలోయింగ్ సాయి పల్లవికి ఉంది. నేను ఈ విషయాన్ని వ్యక్తిగతంగా చెప్పాలనుకున్నాను. కానీ, ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది’’ అని అన్నారు. అయితే సాయి పల్లవి అభిమానులు కేకలు వేయడంతో.. సాయి పల్లవి సుకుమార్ వద్దకు వెళ్లి, “మీరేం చెప్పాలనుకున్నా, దయచేసి నాకు వ్యక్తిగతంగా చెప్పండి” అని చెప్పింది. శర్వానంద్, రష్కీమా మందన్న జంటగా నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు సాయి పల్లవి, కీర్తి సురేష్, సుకుమార్ అతిథులుగా హాజరయ్యారు.