OG Shooting: సుజిత్ స్పీడ్.. మూడు నెలల్లోనే 50% OG షూటింగ్ కంప్లీట్

దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ ను మొదట కథతోనే చాలా ఇంప్రెస్ చేశాడు.

Published By: HashtagU Telugu Desk
Og

Og

లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా షూటింగ్ కొనసాగుతున్న విధానం చూస్తూ ఉంటే సుజిత్ యమ స్పీడుగా షూటింగ్ చేశాడని తెలుస్తోంది. ఈ కుర్రదర్శకుడు ఈ OG సినిమాను మొదలుపెట్టి ఎంతో కాలం కాలేదు. నిన్న మొన్న అఫీషియల్ గా ఈ ప్రాజెక్టు పై అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ఇక చూస్తుండగానే రెండు మూడు నెలల్లోనే షూటింగ్ 50% పూర్తయిపోయింది. లేటెస్ట్ గా ఈ విషయంలో చిత్ర యూనిట్ క్లారిటీ కూడా ఇచ్చేసింది. దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ ను మొదట కథతోనే చాలా ఇంప్రెస్ చేశాడు.

ముందుగానే బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని అతనికి నమ్మకం కలిగించాడు. ఇక పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వడమే లేటు అతను ఎప్పుడు వస్తే అప్పుడు చక చక కొన్ని కీలకమైన సన్నివేశాలను పూర్తి చేసి వదిలేశాడు. సుజిత్ స్పీడ్ చూసి పవన్ కూడా ఆలస్యం చేయడం లేదు. పవన్ లేని టైక్ లో సుజిత్ మిగతా నటీనటులతో తనకు కావాల్సిన కంటెంట్ రాబట్టుకున్నాడు. ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ని పెద్దగా డిస్టర్బ్ చేయకుండా అలాగే మిగతా ఆర్టిస్టుల డేట్స్ క్లాష్ కాకుండా సుజిత్ జాగ్రత్త పడిన విధానం ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా అందరిని అట్రాక్ట్ చేస్తుంది.

అయితే ఇతని కంటే ముందుగానే రెండేళ్ళ క్రితం క్రిష్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాను స్టార్ట్ చేశాడు. కానీ ఇంకా ఆ ప్రాజెక్టు షూటింగ్ సగం కూడా పూర్తి కాలేదు. సరైన ప్లానింగ్, దూరద్రుష్టి ఉంటే సినిమాను త్వరగా తీయడం సాధ్యమేనని మరోసారి సుజిత్ ప్రూవ్ చేశాడు. టాలీవుడ్ లో వేగంగా సినిమాలు తీసే దర్శకుడు పూరి తర్వాత సుజిత్ నిలుస్తాడని చెప్పక తప్పదు.

Also Read: KCR Strategy: కేసీఆర్ ‘కాపు’ రాజకీయం.. కాపు భవన్ తో ఆంధ్రులకు గాలం!

  Last Updated: 26 Jun 2023, 03:58 PM IST