Suhas: మరో ప్రేమకథకు సుహాస్ గ్రీన్ సిగ్నల్.. ఓ భామ అయ్యో రామ సినిమా షురూ

  • Written By:
  • Publish Date - March 30, 2024 / 11:28 PM IST

Suhas: టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల అంబాజీపేట మ్యారేంజ్ బ్యాండ్ తో ఆట్టుకున్న ఈ హీరో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా ఓ భామ అయ్యో రామ చేస్తున్నాడు.  మాళ‌విక మ‌నోజ్ హీరోయిన్‌. రామ్ గోదాల ద‌ర్శ‌కుడు. హీరో, హీరోయిన్‌పై చిత్రీక‌రించిన ముహుర్త‌పు స‌న్నివేశానికి ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ నిచ్చారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో క‌థానాయ‌కుడు సుహాస్ మాట్లాడుతూ ద‌ర్శ‌కుడు మారుతి గారి ద‌గ్గ‌ర డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేస్తున్న‌ప్ప‌టి నుంచి నాకు ద‌ర్శ‌కుడితో ప‌రిచ‌యం వుంది. మంచి క‌థ‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. నా అభిమాన న‌టుల‌తో న‌టించే అవ‌కాశం నాకు ఈ సినిమాతో దొరికింది. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం షూటింగ్‌కు వెళ‌దామా అని ఎదురుచూస్తున్నాను అన్నారు. ఈ చిత్రంలో ప్ర‌ముఖ పాత్ర పోషిస్తున్న నువ్వునేను ఫేం అనితా మాట్లాడుతూ నా సెకండ్ ఇన్నింగ్స్‌కు ఫ‌ర్ ఫెక్ట్‌గా కుదిరిన చిత్ర‌మిది. న‌న్ను ఎంత‌గానో ఆక‌ర్షించిన క‌థ ఇది అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ఇదొక బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ, సుహాస్ కొత్త‌గా ద‌ర్శ‌క‌త్వం చేసే వాళ్ల‌కు దొరికిన వ‌రం. ఎంతో కంఫ‌ర్ట‌బుల్ ఆర్టిస్ట్‌. చాలా వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో, సెలెక్టివ్ సినిమాలు చేస్తున్నాడు. అలాంటి సుహాస్ సినిమా చేయ‌డం సంతోషంగా వుంది. నిర్మాతలు ఎక్క‌డా రాజీప‌డ‌కుండా మంచి టెక్నిషియ‌న్స్‌ను ఇచ్చాడు. ర‌థ‌న్ సంగీతం చిత్రానికి అద‌న‌పు బలంగా వుంటుంది అన్నారు. నిర్మాత‌లు మాట్లాడుతూ ద‌ర్శ‌కుడు రాసుకున్న క‌థ‌కు త‌గిన విధంగా మంచి ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్ కుదిరారు అని అన్నారు.