Site icon HashtagU Telugu

Suhas Ambajipeta Marriage Band Trailer : అంబాజీ పేట మ్యారేజి బ్యాండు ట్రైలర్.. కుర్ర హీరో గురి చూసి కొడతుతున్నాడుగా..!

Suhas Ambajipeta Marriage Band Trailer Talk

Suhas Ambajipeta Marriage Band Trailer Talk

Suhas Ambajipeta Marriage Band Trailer యువ హీరోల్లో సుహాస్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మనసులు గెలుస్తున్నాడు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సుహాస్ లేటెస్ట్ గా అంబాజీ పేట మ్యారేజి బ్యాండు సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు, వెంకటేష్ మహా నిర్మిస్తున్నారు. సినిమాను దుశ్యంత్ కటికనేని డైరెక్ట్ చేశారు. సినిమాకు సంబందించిన ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.

We’re now on WhatsApp : Click to Join

సినిమాలో సుహాస్ సరసన శివాని హీరోయిన్ గా నటించింది. ఇక ట్రైలర్ లో కథ విషయానికి వస్తే మరోసారి చాలా సెన్సిటివ్ టాపిక్ ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఏ ప్రేమకైనా సరే కులాల మధ్య అంతరాలే అడ్డుకట్టగా ఏర్పడతాయి. ఈ సినిమాలో మూల కథ అదే అయినా సినిమాలో చాలా లేయర్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక లీడ్ రోల్ లో సుహాస్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. సినిమా కోసం నిజంగానే గుండు చేయించుకుని మరీ నటించాడు.

అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సినిమా కచ్చితంగా సుహాస్ కి మరో హిట్ సినిమాగా నిలిచేలా ఉంది. కథల విషయంలో సుహాస్ తీసుకుంటున్న ఈ జాగ్రత్తలే అతన్ని ఇలా వరుస సక్సెస్ లు అందుకునేలా చేస్తున్నాయి. సుహాస్, శివాజి జంట కూడా బాగుంది.

Also Read : Dhanush Captain Miller : తెలుగులో కోత.. కెప్టెన్ మిల్లర్ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా..?

సినిమాలో డైలాగ్స్ చాలా ప్రత్యేకంగా నిలిచేలా ఉన్నాయి. అంబాజిపేట మ్యారేజి బ్యాండు సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ అవుతుంది. సంక్రాంతి సినిమాల హడావిడి తగ్గినట్టే. జనవరి 26కి డబ్బింగ్ సినిమాలు హంగామా ఉంది. సో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ సుహాస్ కి కలిసి వస్తుందేమో చూడాలి.