షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న సుహాస్(Suhas) ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేశాడు. కలర్ ఫోటో(Color Photo) సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయ్యాడు సుహాస్. ఆ సినిమా తర్వాత ఓ పక్క హీరోగా వరుసగా సినిమాలు చేస్తూనే మరో పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా సినిమాలు చేస్తున్నాడు.
కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన సుహాస్ ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడానికి ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’(Ambajipeta Marriage Band) అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో ఫుల్ కామెడీతో పాటు ఎమోషన్, మాస్ అంశాలు కూడా ఉండనున్నాయి. ఈ సినిమాలో శివాని హీరోయిన్ గా నటిస్తుండగా దుశ్యంత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ధీరజ్ మొగిలినేని ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
తాజాగా నేడు ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ మొదట్లో ఫుల్ కామెడీ ఉండగా, చివర్లో సీరియస్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. సుహాస్ మాత్రం అద్భుతంగా నటించాడు అని తెలిసిపోతుంది. ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు సుహాస్.