టీవీ రంగంలో తన కష్టం, ట్యాలెంట్ తో స్టార్ గా ఎదిగాడు సుడిగాలి సుధీర్(Sudigali Sudheer ). ఆ తర్వాత సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి కమెడియన్ గా నటించాడు. ఇపుడు వరుసగా హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా సుధీర్ నెక్స్ట్ సినిమా పూజా కార్యక్రమాలు చేసుకుంది. అయితే సుధీర్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
తమిళ్ లో బ్యాచిలర్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయింది దివ్యభారతి(Divya Bharathi). ఆ సినిమాతో స్టార్ అయిపొయింది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు పెడుతూ అభిమానులని బాగా సంపాదించుకుంది. తెలుగులో కూడా ఈ అమ్మడికి ఫ్యాన్స్ ఉన్నారు. తమిళ్ లో బ్యాచిలర్ తర్వాత ఇంకో సినిమా చేసింది. ఇప్పుడు సడెన్ గా మన తెలుగులో సుధీర్ పక్కన సినిమా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
సుడిగాలి సుధీర్ , దివ్య భారతి హీరోహీరోయిన్లుగా పాగల్ సినిమా దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వంలో నిర్మాతలు చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ, బెక్కం వేణుగోపాల్ నిర్మాణంలో లక్కీ మీడియా మరియు మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా నేడు ఉదయం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు, కె.ఎస్ రామారావు, సూర్యదేవర రాదాకృష్ణ, కెఎల్ దామౌదర ప్రసాద్.. పలువురు హాజరయ్యారు. చదలవాడ శ్రీనివాస్ క్లాప్ కొట్టగా జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.
దీంతో ఇటు దివ్యభారతి ఫ్యాన్స్, అటు సుధీర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూట్ మొదలుపెట్టనున్నారు.