Sudigali Sudheer జబర్దస్త్ తో సూఒపర్ పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వస్తున్నాడు. అయితే స్మాల్ స్క్రీన్ పై ఎంత క్రేజ్ ఉన్నా సినిమాల్లో రాణించాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన సుధీర్ సాఫ్ట్ వేర్ సుధీర్ తో హీరోగా మారాడు. ఆ తర్వాత వాంటెడ్ పండుగాడు, గాలోడు, కాలింగ్ సహస్ర సినిమాలు చేశాడు.
సుడిగాలి సుధీర్ చేసిన ఈ సినిమాలు జస్ట్ ఓకే అనిపించుకున్నా అతనికి పెద్దగా అవకాశాలు తీసుకు రావట్లేదు. బుల్లితెర మీద స్టార్ క్రేజ్ వెండితెర మీద అంతగా ఉపయోగపడట్లేదు. అందుకే మళ్లీ సుధీర్ తిరిగి బుల్లితెర మీదకు వస్తున్నాడు. ఈటీవీలో జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిన సుధీర్ మళ్లీ అదే ఈటీవీలో ఫ్యామిలీ స్టార్స్ అంటూ ఒక కొత్త షోతో వస్తున్నాడు.
ఈ షోకి సంబందించిన ప్రోమో రిలీజ్ చేశారు. సుధీర్ గుంటూరు కారం లోని డైలాగ్ ఆట చూస్తావా అంటూ అదరగొట్టేశాడు. మొత్తానికి సుడిగాలి సుధీర్ మళ్లీ స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. ఇంతకీ ఫ్యామిలీ స్టార్స్ కాన్సెప్ట్ ఏంటి.. ఆ షో ఎలా ఉంటుంది అన్నది త్వరలో తెలుస్తుంది. ఇదే కాకుండా ఆహాలో కూడా రెండు షోలకు హోస్ట్ గా చేస్తూ అలరిస్తున్నాడు సుధీర్. మరి తిరిగి స్మాల్ స్క్రీన్ కి వచ్చిన సుధీర్ సినిమాలు కొనసాగిస్తాడా లేదా ఇక్కడే బెటర్ అని ఉండిపోతాడా అన్నది చూడాలి.