Site icon HashtagU Telugu

Sudheer Babu : కొడుకు దరువు వేస్తుంటే.. పాట పాడి అదరగొట్టిన సుధీర్ బాబు..

Sudheer Babu Sing Murugudi Maaya Song With His Sons Charith Maanas Darshan

Sudheer Babu Sing Murugudi Maaya Song With His Sons Charith Maanas Darshan

Sudheer Babu : టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు ‘హరోంహర’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రూరల్ గ్యాంగ్ స్టార్ స్టోరీ నేపథ్యంతో 1980’s బ్యాక్‌డ్రాప్‌ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ నెలాఖరులో రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతున్న ఈ చిత్రం.. ప్రమోషన్ వర్క్స్ ని మూవీ టీం కూడా స్టార్ట్ చేసింది. ఈక్రమంలోనే టీజర్, సాంగ్స్ ని రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్, టైటిల్ సాంగ్, ‘కనులెందుకో’ అనే మెలోడీ సాంగ్ ఆడియన్స్ ముందుకు వచ్చాయి. తాజాగా ‘మురుగుడి మాయ’ అనే మాస్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఇక ఈ సాంగ్ ని ప్రమోట్ చేసేందుకు సుధీర్ బాబు.. తన కొడుకులతో కలిసి ఓ వీడియో చేసి నెట్టింట షేర్ చేసారు. ఆ వీడియోలో సుధీర్ మురుగుడి మాయ పాటని పాడుతూ కనిపిస్తుంటే.. చిన్న కొడుకు దర్శన్ తండ్రి స్వరానికి దరువు వేస్తూ కనిపిస్తున్నారు.

ఇక ఈ మొత్తాన్ని పెద్ద కొడుకు చరిత్ మానస్ వీడియో రికార్డు చేసాడు. ఈ వీడియోని సుధీర్ బాబు నెట్టింట షేర్ చేయగా.. ప్రస్తుతం వైరల్ గా మారింది. మరి కొడుకులతో కలిసి సుధీర్ బాబు పాడిన ఆ పాటని, అలాగే సినిమాలోని ఒరిజినల్ సాంగ్ ని కూడా వినేయండి.

జ్ఞానసాగర్ ద్వారకా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం మే 31న రిలీజ్ కాబోతుంది. మాళవిక శర్మ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకం పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్న ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారు.

Also read : Tabu : హాలీవుడ్ సూపర్ హిట్ సిరీస్‌లోకి టబు ఎంట్రీ.. ‘డూన్’ ప్రీక్వెల్‌లో ముఖ్య పాత్ర..