Chandrababu : చంద్రబాబును కలిసిన మహేష్ బాబు బావమరిది..

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు బావమరిది సుధీర్ బాబు కలిశారు

Published By: HashtagU Telugu Desk
Sudheer Meets Cbn

Sudheer Meets Cbn

ఏపీలో కూటమి విజయం సాధించడం..చంద్రబాబు (Chandrababu) , పవన్ కళ్యాణ్, నారా లోకేష్ , బాలకృష్ణ ఇలా క్రేజీ ఉన్న నేతలంతా భారీ మెజార్టీ తో విజయం సాధించడం తో పార్టీల శ్రేణులే కాదు టాలీవుడ్ సైతం సంబరాలు చేసుకుంటుంది. గత వైసీపీ ప్రభుత్వంలో టాలీవుడ్ ఎంత దెబ్బ తిందో తెలియంది కాదు..అందుకే ఈసారి కూటమి అధికారంలోకి రావాలని కొంతమంది ప్రత్యేక్షంగా ప్రచారం చేస్తే..మరికొంతమంది పరోక్షంగా మద్దతు తెలిపారు. ఇక ఇప్పుడు వారు కోరుకున్నట్లే కూటమి రావడం తో టాలీవుడ్ కు సైతం మంచి రోజులు రాబోతున్నాయని భావిస్తున్నారు. ఇదే క్రమంలో కాబోయే సీఎం చంద్రబాబు ను వరుసపెట్టి కలుస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు బావమరిది సుధీర్ బాబు కలిశారు.

We’re now on WhatsApp. Click to Join.

సుధీర్ బాబు హీరోగా నటించిన హరోం హర అనే సినిమా ఈ నెల 14 న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా మొత్తం చంద్రబాబు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో కుప్పం నుంచి పోటీ చేసి గెలుపొందిన చంద్రబాబు ను సుధీర్ బాబు కలిశారు. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తో కలిసి చంద్రబాబు దగ్గరికి వెళ్లిన సుధీర్ బాబు ఆయనతో కొద్దిసేపు పర్సనల్ గా మాట్లాడారు. ఇక దానికి సంబంధించిన వీడియోని సినిమా యూనిట్ రిలీజ్ చేయగా అది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది.

Read Also : Vijay Deverakonda : ‘అవును’ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా చేయాల్సింది.. రవిబాబు కామెంట్స్..

  Last Updated: 10 Jun 2024, 04:35 PM IST