Sudheer Babu Haromhara Postponed సుధీర్ బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక డైరెక్షన్ లో వస్తున్న సినిమా హరోమ్హర. ప్రచార చిత్రాలతో సినిమాపై బజ్ తీసుకు రాగా సినిమా తో సుధీర్ బాబు ఈసారి పక్కా హిట్ కొడతాడని అనుకున్నారు. మే 31న హరోమ్హర సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ ఆ డేట్ కి మరో నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వడం వల్ల హరోమ్హర వాయిదా వేయాల్సి వస్తుంది.
ఇదే విషయాన్ని వెల్లడిస్తూ బాధగా ఉన్నా తప్పట్లేదు. కొన్ని కారణాల వల్ల సినిమాను జూన్ 14కి వాయిదా వేస్తున్నామని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కృష్ణ గారి పుట్టినరోజు సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నాం కానీ అది కుదరడం లేదు. అయితే జూన్ లో రిలీజైన తన సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయని అన్నారు సుధీర్ బాబు.
Also Read : Kiara Advani : అలాంటి సినిమాలే చేస్తా అంటున్న కియారా.. ఆ రెండు సినిమాలతో టాప్ లేపేస్తుందా..?
జూన్ నెలలో రిలీజైన ప్రేమకథా చిత్రం, సమ్మోహనం సినిమాలు జూన్ లో రిలీజ్ అయ్యాయి. ఆ రెండు సినిమాలు సుధీర్ బాబుకి మంచి పేరు తెచ్చి పెట్టాయి. సుధీర్ బాబు హరోం హర సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. సినిమా 1989 కాలం నాటి కథతో పీరియాడికల్ స్టోరీతో వస్తుంది. మే 31 నుంచి జూన్ 14కి వెళ్తున్న సుధీర్ బాబు సినిమాతో సక్సెస్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.
For various reasons, #HaromHara will now be releasing in theaters worldwide on 14th June. Although I feel sad for missing the release on the occasion of Krishna gari birthday, nevertheless June is still my lucky month. PKC & Sammohanam were both released during this time😎 I… pic.twitter.com/NZvcKA2Fdu
— Sudheer Babu (@isudheerbabu) May 21, 2024