Sudher Babu : అక్కడ ఫ్లాప్ ఇక్కడ హిట్..!

హరోం హర వారి రీజనల్ సినిమాల లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉందని చెబుతున్నారు. హరోం హర సినిమా డిజిటల్ రిలీజ్ లో సూపర్ హిట్ అనిపించుకుంది.

  • Written By:
  • Publish Date - July 25, 2024 / 10:37 AM IST

Sudher Babu ఘట్టమనేని హీరో సుధీర్ బాబు రీసెంట్ గా హరోం హర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జూన్ 14న ఈ సినిమా రిలీజ్ అవ్వగా సినిమా కమర్షియల్ ఫార్మట్ కి తగినట్టే ఉన్నా ఎందుకో ఆడియన్స్ సరిగా రిసీవ్ చేసుకోలేదు. పోటీగా వచ్చిన తమిళ డబ్బింగ్ సినిమా మహారాజని హిట్ చేశారు కానీ హరోం హరని పట్టించుకోలేదు. ఐతే ఈ సినిమా రీసెంట్ గా డిజిటల్ రిలీజైంది. ఒకేసారి రెండు ఓటీటీలో రిలీజైన హరోం హర సినిమా అమేజాన్ ప్రైం వీడియోస్ లో మాత్రం మంచి వ్యూస్ సాధిస్తుంది.

ఈ విషయాన్ని ప్రైం వీడియోస్ ప్రకటించింది. హరోం హర వారి రీజనల్ సినిమాల లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉందని చెబుతున్నారు. హరోం హర సినిమా డిజిటల్ రిలీజ్ లో సూపర్ హిట్ అనిపించుకుంది. హరోం హర సినిమా విషయంలో ఈ ఫలితం సుధీర్ బాబుని సంతృప్తి పరుస్తుంది. సినిమా థియేట్రికల్ రన్ ఊహించిన విధంగా జరగలేదని నిరాశగా ఉన్న సుధీర్ బాబు ఓటీటీ లో సూపర్ హిట్ టాక్ అందుకోవడం మాత్రం కిక్ ఇస్తుంది.

సుధీర్ బాబు హీరోగా తన సత్తా చాటడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఐతే హరోం హర సినిమా మంచి కమర్షియల్ సినిమాగా వచ్చినా ఆడియన్స్ ఎందుకో ఈ సినిమాను పెద్దగా చూడలేదు. కొన్ని సినిమాలు థియేటర్ లో మిస్ అయ్యి ఓటీటీలో చూసి అర్రె మంచి సినిమాను మిస్ అయ్యామే అనుకుంటాం. ప్రస్తుతం హరోం హర (Haromhara) సినిమా చూసిన కొందరు ఆడియన్స్ అదే ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు.

ఈ సినిమాకు మిక్సెడ్ టాక్ వచ్చినా సుధీర్ బాబు స్టామినా సినిమాను నిలబెట్టలేకపోయింది. ఫలితంగా సినిమా నిరాస మిగిల్చింది. ఐతే సుధీర్ బాబుకి మాత్రం ప్రేక్షకులకు ఎలాంటి సినిమా ఇవ్వాలన్న క్లారిటీ మాత్రం వచ్చిందని చెప్పొచ్చు.

Also Read : Mamitha Baiju : ప్రేమలు హీరోయిన్ తో మైత్రి మూవీ మేకర్స్..!