Site icon HashtagU Telugu

Mahesh Babu : మహేష్ బాబు ఇంతలా డైట్ ఫాలో అవుతారా..? ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో కూడా..

Sudheer Babu Comments About Mahesh Babu Food Diet

Sudheer Babu Comments About Mahesh Babu Food Diet

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాలుగు పదుల వయసు దాటినా, ఇంకా కుర్రాడిలాగానే కనిపిస్తుంటారు. అయితే ఈ ఫిట్‌నెస్ వెనుక ఎంతో కష్టమైన డైట్ దాగి ఉంది. ఇష్టమైనవి కూడా తినకుండా ఉంటూ.. తన ఫిట్‌నెస్ కోసం మహేష్ ఎంతో కష్టపడుతుంటారు. గతంలో మహేష్ తన డైట్ గురించి చెప్పుకొచ్చారు. రైస్ తినడం అనేది చాలా తక్కువ అని, పోషక ఆహారాలతోనే తాను జీవనం కొనసాగిస్తూ వస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

అయితే ఈ డైట్ ని మహేష్ కేవలం.. ఇంటి వద్ద లేదా షూటింగ్స్ లో మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కూడా ఫాలో అవుతుంటారట. ఈ విషయాన్ని మహేష్ బాబు బామ్మర్ది, టాలీవుడ్ హీరో సుధీర్ బాబు తెలియజేసారు. సుధీర్ బాబు నటించిన ‘హరోం హర’ మూవీ వచ్చే వారం రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న సుధీర్ బాబు.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఫుడ్ విషయం గురించి వచ్చింది. దీని గురించి సుధీర్ బాబు మాట్లాడుతూ.. “మహేష్ గతంలో అన్ని ఫుడ్స్ బాగానే తినేవాడు. కానీ మెల్లి మెల్లిగా అన్ని ఆపేస్తూ వచ్చారు. ఇప్పుడు తనకంటూ ప్రత్యేకంగా ఓ ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. ఫ్యామిలీ ఫంక్షన్స్ అప్పుడు కూడా తాను అదే ఫుడ్ తీసుకుంటాడు” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్.. మరి ఇంతలా డైట్ ఫాలో అవుతుంటే ఫిట్‌గా, అందంగా ఉండక ఉంటారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా మహేష్ ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో.. మహేష్ తన ఫిట్‌నెస్ విషయంలో మరింత జాగ్రత్త వహిస్తున్నారు.