Site icon HashtagU Telugu

Sudha Kongara : కృష్ణ భగవాన్ తో ఆకాశం నీ హద్దురా డైరెక్టర్.. ఈ కాంబో ఎవరు ఊహించి ఉండరు..!

Sudha Kongara Directed Krishna Bhagavan Andhra Andagadu

Sudha Kongara Directed Krishna Bhagavan Andhra Andagadu

Sudha Kongara గురు, ఆకాశం నీ హద్దురా సినిమాలను డైరెక్ట్ చేసిన సుధ కొంగర ఆమె ఈ సినిమాల కన్నా ముందు ఓ తెలుగు కమెడియన్ తో సినిమా చేసిందంటే నమ్మగలరా. అవును ఇది నిజమే అప్పటి స్టార్ కమెడియన్ కృష్ణ భగవాన్ తో సుధా కొంగర తన తొలి సినిమా చేశారు. 2008 లో ఆమె ఆంధ్రా అందగాడు సినిమాను డైరెక్ట్ చేసింది సుధా కొంగర. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

అందుకే ఆమె మణిరత్నం దగ్గర అసిస్టెంట్ గా చేరి కొన్ని సినిమాలకు పనిచేసింది. ఆ తర్వాత గురు, ఆకాశం నీ హద్దురా సినిమాలతో సత్తా చాటింది. ఈ సినిమాలతో ఆమె తన ప్రతిభ చాటగా ప్రస్తుతం ఆమె సూరరై పోట్రు సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

హిందీ సినిమా తర్వాత మళ్లీ సూర్యతో సినిమా చేయాలని చూస్తున్నారు సుధా కొంగర. తెలుగు స్టార్స్ తో సుధా కొంగర సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నా ఇక్కడ స్టార్స్ ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. మరి సూర్య సినిమా తర్వాత అయినా ఆమె కు మన వాళ్లు ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.

Also Read : Bigg Boss 7 : ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నది ఎవరు.. ఇక్కడ కూడా బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి..?

We’re now on WhatsApp : Click to Join