Allu Arjun : మోకాళ్లపై కూర్చొని బన్నీని ప్రశంసించిన సుచిత్ర చంద్రబోస్

Allu Arjun : అల్లు అర్జున్‌ నటన, ముఖ్యంగా "జాతర" సీక్వెన్స్‌లో చూపిన అభినయానికి ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు

Published By: HashtagU Telugu Desk
Suchitra Alluarjun

Suchitra Alluarjun

పుష్ప 2 (Pushpa 2) మూవీ బాక్సాఫీస్‌ వద్ద అద్భుత విజయాన్ని సాధించింది. ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇంకా అనేక చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. అల్లు అర్జున్‌(Allu Arjun) నటన, ముఖ్యంగా “జాతర” సీక్వెన్స్‌లో చూపిన అభినయానికి ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ గేయరచయిత చంద్రబోస్ భార్య సుచిత్ర చంద్రబోస్ ఈ చిత్రాన్ని చూసి బన్నీని ప్రశంసించిన తీరు ప్రత్యేకంగా నిలిచింది.

సుచిత్ర చంద్రబోస్ (Suchitra Chandra Bose) “జాతర” సీక్వెన్స్‌ (Jathara Sequence) చూసి ఎంతగానో ఆశ్చర్యపోయారు. స్వతహాగా కొరియోగ్రాఫర్ అయిన ఆమె ఆ సీన్‌లోని అల్లు అర్జున్ డ్యాన్స్‌ మూమెంట్స్‌, ఎమోషన్‌ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. అల్లు అర్జున్‌ యాక్టింగ్ తనను తీవ్రంగా ప్రభావితం చేసిందని , సవ్యమాగ్ బన్నీని కలుసుకుని తన అభినందనలు వ్యక్తం చేశారు. అల్లు అర్జున్‌ను కలిసిన సమయంలో సుచిత్ర అతని ముందు మోకాళ్లపై కూర్చుని తన ప్రశంసలను తెలిపారు. ఇది బన్నీకి కూడా ఒక పెద్ద సర్ప్రైజ్‌గా మారింది. సుచిత్ర ఇలా చేయడం చూసి అల్లు అర్జున్‌ “అయ్యో.. లేవండి” అంటూ దగ్గరికి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. జాతర సాంగ్ లో అమ్మవారి వేషధారణలో అల్లు అర్జున్‌ డ్యాన్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌, ఫైట్‌ సీక్వెన్స్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇది సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆ సీన్‌ చూసినవాళ్లు అల్లు అర్జున్‌కు మరో నేషనల్ అవార్డు రావడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పుష్ప 2 టీమ్ ఈ భారీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

Read Also : Mahesh -Rajamouli Movie : ఐదేళ్లు రాజమౌళి చేతిలో మహేష్..?

  Last Updated: 18 Dec 2024, 08:06 PM IST